*బాలల ముత్యాల హారాలు పుస్తకావిష్కరణ*-బాలసాహిత్యవేత్త గద్వాల సోమన్న

*బాలల ముత్యాల హారాలు పుస్తకావిష్కరణ*-బాలసాహిత్యవేత్త గద్వాల సోమన్న

*బాలల ముత్యాల హారాలు పుస్తకావిష్కరణ* -బాలసాహిత్యవేత్త గద్వాల సోమన్న

ఉట్నూర్:- ఉట్నూర్ సాహితీ వేదిక ఆధ్వర్యంలో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని, శ్రీ,రాథోడ్ శ్రావణ్ గారు రూపొందించిన తెలుగు సాహిత్యంలో నూతన లఘు వచన కవిత ప్రక్రియ ముత్యాలహారం ఈ ప్రక్రియలో బాలబంధు,బాల సాహితీ వేత్త,  శ్రీ గద్వాల సోమన్న  కర్నూల్ జిల్లా గారు రచించిన" బాలల ముత్యాల హారాలు" పుస్తకాన్ని  ముఖ్య అతిథి  జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత గౌ,, శ్రీ ,కడార్ల రంగయ్య గారి చేతుల మిదిగ  స్థానిక తిరుమల ఫంక్షన్ హాల్ లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఉట్నూరు సాహితీ వేదిక అధ్యక్షులు గౌరవ శ్రీ కవన కోకిల జాదవ్ బంకట్ లాల్ గారు అధ్యక్షత వహించారు, కార్యక్రమానికి ప్రధాన కార్యదర్శి శ్రీ ముంజం జ్ఞానేశ్వర్ గారు, తెలంగాణ రాష్ట్ర రచయిత సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు,ఉసావే వ్వవస్తాపక అధ్యక్షులు గౌరవ శ్రీ గోపగాని రవీందర్ గారు, ప్రముఖ కవి రచయిత, శ్రీ కరిపె రాజ్ కుమార్ గారు,ఉసావే పూర్వ అధ్యక్షులు శ్రీ కొండగుర్ల లక్ష్మయ్య గారు, జిల్లా ఉత్తం ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు శ్రీ వామన్ రావు గారు,శ్రీ మెస్రం బాదు గార్ల చేతుల మీదుగా ఘనంగా జరిగింది.అనంతరం ముత్యాల హారం రూపకర్త శ్రీ రాథోడ్ శ్రావణ్ మాట్లాడుతూ  తెలుగు సాహిత్యంలో నూతన లఘు వచన కవిత ప్రక్రియలో ఇది రెండో సంకలనం అని తెలుగు భాషను పరిరక్షించాల్సిన  బాధ్యత  ప్రతి ఒక్కరి పై ఉందని అన్నారు.ఈ
 ప్రక్రియలో కవితలు రాయడం చాలా సులభమని ఉసావే ఆధ్వర్యంలో నడిపిస్తున్న ఈ ప్రక్రియ ఆనతి కాలంలోనే బహుళ ప్రాచుర్యం పొందిందని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో    ఉట్నూర్ సాహితీ వేదిక కవులు, శ్రీ సాకీవార్ ప్రశాంత్,శ్రీ తొడసం నాగోరావు, డాక్టర్ ఇందల్ సింగ్, శ్రీ జాదవ్ మురళి, ముంజం మల్లికార్జున్, చౌహాన్ పరమేశ్వర్, శ్రీ పవార్ వినోద్,శ్రీ జాదవ్ ధరంసింగ్, ఉపాధ్యాయులు శ్రీ పవార్ ఉదారాం,జివేందర్, బాలకవులు కార్కురి మధుకర్,కుదురు రామకృష్ణ, వివిధ ప్రాంతాల పాఠశాలల నుంచి వచ్చిన ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాల్గొన్నారు.

0/Post a Comment/Comments