రైతు మా రాజు - దొడ్డపనేని శ్రీ విద్య

రైతు మా రాజు - దొడ్డపనేని శ్రీ విద్య

*రైతు మా రాజు*


మట్టి రైతుకు దైవమాయనే
చివరికి మట్టిలోనే కలిసి పోయెనే
నీ స్వేదమే పైరుకి నీరాయనే
గిట్టుబాటు ధర లేక రోదించెనే
వ్యయసాయ క్షేత్రమే నీకు జీవమాయనే

కరువు రక్కసి తో నిరంతరం సోఖించినే
వాన చుక్క కోసం పడిగాపులు గాసెనే
ప్రకృతి విలయాలకు తల్లడిల్లెనే
నేడు రేపు ఆకలితో అలమటించినే

రైతు దేశానికే వెన్నెముకాయనే
దేశ ప్రగతికే తోడు నీడాయనే
ఆకలి కేకలతో పొట్ట చేత పట్టినే
ఆత్మ హత్యలే రైతన్నకి  శరణ్యమాయనే
బురదే బంగారమని మురిసిపోయనే
పసిడి రాసులు కోసం నిత్య ఆరాటమాయనే

నాగలి చేత పట్టి వరి మొలకలు వేసినే
మట్టిని గెలిచే విత్తనాల కోసం వేచెనే
కష్ట సుఖాల కోడ్చి రక్తం ధారపోసెనే
పచ్చని పంట కోసం కళ్ళు కాయలు కాచెనే
*అయినా రైతు ఎప్పుడూ మా రాజాయనే*

✒️✒️✒️✒️✒️✒️✒️✒️✒️✒️✒️

*దొడ్డపనేని శ్రీ విద్య*
విజయవాడ
9492 85 84 42
22/11/2021
సోమవారం

0/Post a Comment/Comments