కవిత పోలయ్య కవి ప్రచురించ ప్రార్థన

కవిత పోలయ్య కవి ప్రచురించ ప్రార్థన

ఓ తల్లీ ! మా కల్పవల్లీ ! 

ఓ తల్లీ ! మా కల్పవల్లీ ! 
మమ్ము కరుణించవమ్మా ?
కాపాడవమ్మా ! 
ఓ కనకదుర్గమ్మ తల్లీ ! 

ఈ సుందరమైన 
ఈ శుభకరమైన
ఈ అద్భుతమైన
ఈ ఆనందకరమైన
ఈ మధురమైన 
ఈ మనోహరమైన
ఈ మంగళకరమైన 
ఈ శుభదినాన 
ఈ శుభప్రదమైన
ఈ సుప్రభాతవేళ

మా చిరకాల వాంఛలు
చింతలు చీకాకులు...
అగ్నిలో ధగ్దమైపోనియ్
మా బ్రతుకులు... 
బంగారుమయం కానియ్..!

మా జీవితాలు... 
సుఖశాంతులతో వర్థిల్లనియ్..!
మా కంట...
ఆనందభాష్పాలు రాలనియ్..!

మా ఇంట...
సిరి సంపదలు పొంగి పొర్లనియ్..! 
మా ముఖాలలో...
వేయి వెన్నెల వానలు కురవనియ్..!
మా పెదాలపై..
చిరునవ్వులు చిందులు వేయనియ్..!

ఓ తల్లీ ! మా కల్పవల్లీ ! 
కరుణించవమ్మా ! ఓ కనకదుర్గమ్మ  ! 
ఓ జగజ్జననీ ! ఓ వరదాయిని ‌!
వందనాలమ్మా! మీకు వందనాలు !
శతకోటి...పాదాభివందనాలు తల్లీ !

రచన. పోలయ్య కవి కూకట్లపల్లి
అత్తాపూర్ హైదరాబాద్...9110784502

0/Post a Comment/Comments