రోడ్డుపై ధాన్యము
ఆరబోసి రైతులు
అకాలవర్షానికి
పడుతుండె తిప్పలు
పంటపాడుచేసింది
వేదనలే మిగిల్చింది.
రైతులకు మింగుడు
పడకుండా వర్షాలు
తెచ్చిపెడుతున్నాయి
తట్టుకోలేని నష్టాలు
చెడగొట్టు వానలు
ఫలించని కలలు.
కాలం అనుకూలంగ
సహకరిస్తే తప్ప
రైతన్న చేయలేడు
వ్యవసాయం ఒప్ప
ప్రకృతి మేలుచేయాలి
రైతు బాగుపడాలి.
పంటచేతికి వచ్చి
సంతోషించే వేళ
వర్షం చెరిపింది
రైతుమోమునకళ
అన్నదాతను ముంచింది
కన్నీళ్లు మిగిల్చింది.