గద్వాల సోమన్న పై కంద పద్యాలు- -శ్రీ కె.ఈశ్వరప్ప గారు,ఆలూరు,కర్నూలు జిల్లా

గద్వాల సోమన్న పై కంద పద్యాలు- -శ్రీ కె.ఈశ్వరప్ప గారు,ఆలూరు,కర్నూలు జిల్లా

గద్వాల సోమన్న పై కంద పద్యాలు
--------------------------------
సోమన్నా మీకవితలు
పామరులకు,పండితులకు పరిచయమేగా
ప్రామాణిక పరివర్తన
సామాన్యుల కందజేయు సాహస గురువా!

ఆటవెలదులందె యాటలాడుగురువు
మాటబాటలందు దాటిబంచి
మంచికొరకుశిష్య మనసున నిలచిన
సోమనార్యపద్యశోభగంటి

 విద్యా సక్తతబెంచెడి
అద్యాపకవృత్తియందె యాధ్యుండనగా
గద్వాల సోమనార్యా
పద్యాలను లెక్కలందుపంచెడిగురువా.

 ముత్యాల హారమందున
సత్యాలనుయేర్చిగూర్చి సద్గుణ ములనే
భత్యాలనుబాలలకిడ
నిత్యము నినుదలతురయ్య నిజమిదిసోమా!
 -శ్రీ కె.ఈశ్వరప్ప గారు,ఆలూరు,కర్నూలు జిల్లా

0/Post a Comment/Comments