శీర్షిక శ్రీశైల మల్లేశ్వర జ్యోతిర్లింగం- --- పేరు అద్దంకి లక్ష్మి ఊరు ముంబై

శీర్షిక శ్రీశైల మల్లేశ్వర జ్యోతిర్లింగం- --- పేరు అద్దంకి లక్ష్మి ఊరు ముంబై

శీర్షిక శ్రీశైల మల్లేశ్వర జ్యోతిర్లింగం
ప్రక్రియ సున్నితం
రూపకర్త శ్రీమతి నెల్లుట్ల సునీత గారు
తేదీ 26_11_21


నల్లమల అరణ్య శిఖరాగ్రము
 పవిత్ర కృష్ణానది  తీర ప్రాంతము
శ్రీశైలకొండల్లో  వెలసిన ఆలయము
చూడ చక్కని తెలుగు సున్నితంబు

భ్రమరాంబ సమేత మల్లికార్జునుడు
స్వయంభువుగా వెలసిన శివుడు
ద్వాదశ జ్యోతిర్లింగాల ప్రసిద్ధుడు
చూడ చక్కని తెలుగు సున్నితంబు

భ్రమర రూపంలో ఆదిశక్తి
అరుణేసురుని సంహరించిన పరాశక్తి
నేటికీ భ్రమరనాదముతో అదృశ్యశక్తి
చూడచక్కని తెలుగు సున్నితంబు

మల్లన్న భక్తిని కటాక్షించెను
అర్జునకు పాశుపతాస్త్రం ఒసగెను
మహిమాన్విత అష్టాదశ శక్తి పీఠము
చూడచక్కని తెలుగు సున్నితంబు

చతుర్ముఖ గోపురాల కట్టడము
శ్రీశైలశిఖర దర్శనము అద్వితీయము
మాత్రాన పునర్జన్మ రాహిత్యము
చూడచక్కని తెలుగు సున్నితంబు

 పేరు అద్దంకి లక్ష్మి
  ఊరు ముంబై

0/Post a Comment/Comments