శీర్షిక దీపావళి - --- పేరు అద్దంకి లక్ష్మి ఊరు ముంబై

శీర్షిక దీపావళి - --- పేరు అద్దంకి లక్ష్మి ఊరు ముంబై

శీర్షిక దీపావళి
 ప్రక్రియ సున్నితం
 రూపకర్త శ్రీమతి నెల్లుట్ల సునీత  
 తేది 23 11 21
   ఇంటింట ఆనంద హేళీ
  వచ్చెనమ్మ సంబరాల దీపావళి
  భారతీయ సంస్కృతి శోభావళి
  చూడ చక్కని తెలుగు సున్నితంబు

 దీపంజ్యోతి పరబ్రహ్మ స్వరూపం
  సద్గుణ సంపత్తి నిదర్శనం  
 సుఖము  శాంతులకు ఆలవాలం
 చూడచక్కని తెలుగు సున్నితంబు

  విజ్ఞాన జ్యోతులు వెలిగిద్దాం  
   మనసులో చీకట్లను తరిమివేద్దాం
   స్వార్ధాన్ని కల్మషాలను కడిగివేద్దాం
  చూడ చక్కని తెలుగు సున్నితంబు

  సత్యభామ ఉగ్రరూపం దాల్చి
 యుద్ధమున నరకాసురుని కూల్చి
 లోకానికి విశ్వశాంతి కూర్చి
 చూడ చక్కని తెలుగు సున్నితంబు

 మహాలక్ష్మి నట్టింట నటించగ
 దీపాల వెలుగులు నింపగ
   ఆనంద పరవశాలు పొంగగ
చూడచక్కని తెలుగు సున్నితంబు

 వరుసలలో వెలిగించు  దీపాలు
 విద్యుత్ తీగల అలంకరణలు
  రంగురంగులు వెదజల్లు తోరణాలు
  చూడ చక్కని తెలుగు సున్నితంబు

 చి టపట  లాడుతూ చీమటపాకాయలు
 గిరగిర తిరుగుతూ భూచక్రాలు
  వెలుగులు జిమ్మే మతాబులు
 చూడ చక్కని తెలుగు సున్నితంబు

  చీకటి వెలుగుల రంగేళి
  జీవితమే మనకుకొక దీపావళి
  కలసిమెలసి చేసుకునే ఆనందరవళి
  చూడ చక్కని తెలుగు సున్నితంబు


  పేరు అద్దంకి లక్ష్మి
   ఊరు ముంబై


0/Post a Comment/Comments