భక్త కోటికి ఈశ్వరానుగ్రహం - దొడ్డపనేని శ్రీ విద్య

భక్త కోటికి ఈశ్వరానుగ్రహం - దొడ్డపనేని శ్రీ విద్య

కార్తీక మాసం - విశిష్టత*

 *భక్త కోటికి ఈశ్వరానుగ్రహం*


తెలుగు మాసాల్లో విశిష్టమైనది కార్తీకం
కైలాస వాస ఆదిదేవునికి ఎంతో ప్రీతికరం

నక్షత్ర దర్శనం తో అష్ట ఐశ్వర్య ప్రాప్తం
దీపావళి వెలుగులతో కార్తీకం ప్రారంభం

మగువుల నోచే నోములకు ఎంతో ప్రాధాన్యం
భక్త కోటి నిష్టతో కొలిస్తే శివ పార్వతుల అనుగ్రహం

హరి హరాదులకు ప్రీతికరమైన మాసం
బిల్వపత్రం తో పూజిస్తే ఈశ్వరానుగ్రహం

కార్తీక దీపదానం వలన రెట్టింపు పుణ్యం
తులసి దళాలతో విష్ణువు ప్రసన్నం

సోమవార వ్రతాలతో ఇహపర సౌఖ్యం
పురాణ పఠనముతో ముక్తి మోక్ష ప్రాప్తం

శివనామస్మరణతో అజ్ఞాన చీకట్లు మాయం
దీపారాధనతో జ్ఞాన జ్యోతి సాక్షాత్కారం

నదీ స్నానం చేసిన పాప హరణం
శ్రీ పురుష సూక్తులతో రుద్రాభిషేకం పుణ్యఫలం

ముతైదువులు భక్తితో పూజించిన అదృష్ట యోగం
పరమ పవిత్రమైన కార్తీకం జనులందరికీ  మంచి జరగాలని ప్రార్థిద్దాం
****************************

పేరు:
*దొడ్డపనేని శ్రీ విద్య*
విజయవాడ
9492858442
14/11/2021
ఆదివారం

0/Post a Comment/Comments