నాన్నకు ప్రేమతో...--గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడు

నాన్నకు ప్రేమతో...--గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడు

నాన్నకు ప్రేమతో...
--------------------------------------
నాన్న మనసు త్యాగము
కుటుంబాన మోదము
సృష్టిలో అద్భుతము
జాలువారు అమృతము

వెలుగులీను దీపము
భగవంతుని రూపము
సదనానికర్పితము
నాన్న మహోన్నతము

నాన్న ప్రేమ శిఖరము
వారు ఉన్న పదిలము
విజయానికి అభయము
దీవెనలకు నిలయము

నాన్నొక ఆయుధము
అభివృద్ధి సాధనము
ఇంటికి మూలధనము
నడిపించు ఇంధనము
-గద్వాల సోమన్న

0/Post a Comment/Comments