పసి పిల్లలు-గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడు

పసి పిల్లలు-గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడు

పసి పిల్లలు
-------------------
పసి పిల్లల ఊసులు
పంచదార చిలుకలు
జీవజలపు ధారలు
పాలకడలి తరగలు

చిన్నారుల  తలపులు
పరిమళించు పూవులు
శుద్ధమైన జలములు
చేకూర్చును శుభములు

పసి పాపల నగవులు
వెన్నెలమ్మ వెలుగులు
అందమైన మొలకలు
ఆకసాన చుక్కలు

ఇంటిలోన ప్రమిదలు
కవన వనమున కవితలు
పసి పిల్లలు వేల్పులు
జగతి ప్రగతి పథములు
--గద్వాల సోమన్న 

0/Post a Comment/Comments