చిన్నిచిన్ని పిల్లలు-గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడు

చిన్నిచిన్ని పిల్లలు-గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడు

చిన్నిచిన్ని పిల్లలు
--------------------------------------
పిల్లలున్న గృహములు
మల్లెపూల వనములు
పల్లె సీమ సొగసులు
కొల్లేరు సరస్సులు

పాలవెల్లి కాంతులు
మాలికల తావులు
బాలల హృదయాలు
పాలకడలి తరగలు

చిన్నారుల వాక్కులు
సన్నాయి నాదాలు
వెన్నెలమ్మ జల్లులు
సన్న వెన్న ముద్దలు

కురిసిన చిరుజల్లులు
విరిసిన మరుమల్లెలు
హరివిల్లు వర్ణాలు
సిరిమువ్వ  మధురిమలు
--గద్వాల సోమన్న ,
ఎమ్మిగనూరు.

0/Post a Comment/Comments