కొసమెరుపు కథ. పోలయ్య కవి ప్రచురించ ప్రార్థన

కొసమెరుపు కథ. పోలయ్య కవి ప్రచురించ ప్రార్థన

ఓ దైవమా దాహం తీర్చుమా! 
(కొసమెరుపు చిట్టికథ)
రచన. పోలయ్య కవి కూకట్లపల్లి
అత్తాపూర్ హైదరాబాద్ - 9110784502

చిట్టి కథ.

లాక్ డౌన్ కారణంగా బస్సులు రైళ్లు రద్దు.
ఆనంద్ నారాయణ ఇద్దరు ప్రాణమిత్రులు.
ప్రక్కఊరికి ప్రయాణమయ్యారు. మండుటెండలు. విపరీతమైన దాహం. ఇద్దరూ ఒక చెట్టుక్రిందకు చేరి భగవంతుని ప్రార్ధించారు. ఆశతో అర్థించారు
ఓ దయగల దైవమా మా దాహం తీర్చవా అని.
అంతే వారికొక "దివ్యవాణి" వినిపించింది
మీ ఇద్దరి దాహం త్వరలోనే తీరుతుంది,
కానీ మీరు వెంటనే ఒక బావిని త్రవ్వాలి

అందుకు మూడు షరతులు:
ఒకటి.1 రోజులోనే బావిని ‌త్రవ్వాలి
రెండు.10 కిలోమీటర్ల దూరంలో ఒక స్థలంలో త్రవ్వాలి
మూడు.100 అడుగుల లోతు త్రవ్వాలి

అనగానే నారాయణ అది అసాధ్యమని ఒక రోజులో, ఈ ఎర్రని ఎండలో పది కిలోమీటర్ల దూరం నడిచి వెళ్ళి, వంద అడుగులలోతు బావిని తవ్వడం ఈ భువిలోఎవరికీ సాధ్యం కాదని ఆ చెట్టు కిందే పడుకుని అలసిపోయి వున్నాడు గనుక పాపం ఆదమరచి నిద్రపోయాడు
కానీ ఆనంద్ మాత్రం కొండంత ఆశతో ఆ భగవంతునిపై అపారమైన నమ్మకంతోఎర్రని ఎండలో పదికిలోమీటర్లు ప్రయాణం చేశాడు

అక్కడికి వెళ్లగానే ఆ బావిని చూసి ఆనంద్ ఆశ్చర్యచకితుడై పోయాడు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోయాడు
కారణం ఒక్కటే ,అప్పటీకే ఆ బావి 99 అడుగులులోతు త్రవ్వివుంది.

ఎవరో బహుదూరపు బాటసారి ఊరికి ఉపకారియైన‌ ఒక వృద్దుడు బావిని 99 అడుగులలోతు‌ త్రవ్వి ఈ మధ్యే కరోనాతో కన్నుమూశాడట అక్కడ అన్ని పని ముట్లు సిద్దం గానే ఉన్నాయి ఆనందం పట్టలేక ఆనంద్ బావిలోకి దిగి ఒకే ఒక్క అడుగు త్రవ్వేశాడు అంతే పాతాళగంగ పైకి పొంగి వచ్చింది.తనదాహం తీరిపోయింది అంతే కాదు ఆ బావి ఎందరో బాటసారుల దాహం రోజు తీరుస్తుంది

అవును ఒక మనిషిని నడిపించేది అతని నమ్మకమే
భగవంతుని మీద విశ్వాసంతో చేసే ప్రతికార్యం తప్పక విజయవంతమౌవుతుంది. నిజానికి ఆ ఇద్దరుమిత్రుల్లో
నారాయణ నాస్తికుడు దైవమంటే నమ్మకం లేనివాడు. ఆనంద్ ఆస్తికుడు పరమ భక్తిపరుడు దైవమంటే పూర్తిగా నమ్మకం కలిగినవాడు...

నిజానికి మట్టిని నమ్మినవారు పుట్టించిన
ఆ పరమాత్మను నమ్మినవారు ఎన్నటికీ చెడిపోరని వారు వరాల వర్షంలో తడిసి ముద్ధైపోతారని చరిత్ర చెబుతున్న సత్యం ఔను నిత్యం ఆ శివనామస్మరణ చేసేవారికి చింతలు చీకాకులు ఉండవు చిరునవ్వులు... సిరిసంపదలు తప్ప...

అందుకే అనునిత్యం ఆ భగవన్నామస్మరణ చేయండి. మీ బ్రతుకుల్ని బంగారు మయం చేసుకోండి సుఖసంతోషాలతో ఆయురారోగ్యైశ్వర్యాలతో జీవించండి హాయిగా నిండూనూరేళ్ళు వర్థిల్లండి.... 

0/Post a Comment/Comments