అక్కయ్య (బాలాగేయం)-గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడు

అక్కయ్య (బాలాగేయం)-గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడు

అక్కయ్య (బాలాగేయం)
--------------------------------
అక్క ! బుగ్గపై
చుక్క పెట్టింది
చక్కగ  దేవుని
మ్రొక్కి వేడింది

గుడి నుంచి అక్క
బడికి వెళ్ళింది
వడివడిగా తాను
సందడి చేసింది

గురువుకు దండం
మరువక పెట్టింది
పరువు చదువని
వెరవక చెప్పింది

శ్రద్దగ చదువులు
బుద్ధిగ చదివింది
పెద్దల మాటలు
సద్దియని నమ్మింది

--గద్వాల సోమన్న 

0/Post a Comment/Comments