" రైతు గోస"--గద్వాల సోమన్న , గణితోపాధ్యాయుడు

" రైతు గోస"--గద్వాల సోమన్న , గణితోపాధ్యాయుడు

" రైతు గోస"
----------------------------------------
వినుము రైతుల గోడు
అధికమాయెను నేడు
వారి క్షేమము చూడు
ఓ వెన్నెలమ్మ !

నీట మునిగెను పంట
రుధిర ధారలు కంట
వ్యధలు రైతుల ఇంట
ఓ వెన్నెలమ్మ !

రైతు రాజే నాడు
బానిసే ఈనాడు
అమావాస్య చంద్రుడు
ఓ వెన్నెలమ్మ !

వాడిపోయెను ముఖము
లేదు రైతుకు సుఖము
ముమ్మాటికీ నిజము
ఓ వెన్నెలమ్మ !

అప్పులెంతో పెరిగె
ఆశలన్నీ కరిగె
రైతు నేలకు ఒరిగె
ఓ వెన్నెలమ్మ !

రైతు భుజమును తట్టు
అదే వారికి పట్టు
ధైర్యాన్ని గొనిపెట్టు
ఓ వెన్నెలమ్మ !
--గద్వాల సోమన్న  ,
గణితోపాధ్యాయుడు

0/Post a Comment/Comments