అందమే అందం-గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడు

అందమే అందం-గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడు

అందమే అందం
------------------------------------
జడలోని పూవులు
మెడలోని మాలలు
బడిలోని బాలలు
అందమే అందం

మడిలోని  పంటలు
గుడిలోని గంటలు
సడి లేని  నడి రేయి
అందమే అందం

మహిలోని వనములు
మదిలోని ప్రేమలు
నదిలోని జలములు
అందమే అందం

దివిలోని తారలు
భువిలోని పిల్లలు
తావి గల మల్లెలు
అందమే అందం

--గద్వాల సోమన్న

0/Post a Comment/Comments