పచ్చని మొక్కలు-గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడు

పచ్చని మొక్కలు-గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడు

పచ్చని మొక్కలు
----------------------------------
చిన్నచిన్న మొక్కలు
పుడమితల్లి బిడ్డలు
పచ్చదనం పంచే
జగతిప్రగతి బాటలు

వృక్షాలుగా మారును
మంచి గాలి ఒసగును
ఆరోగ్యమిచ్చును
ఆయుష్షును పెంచును

కనువిందు చేయును
కాలుష్యం తరుమును
ప్రకృతి అందాలకు
ప్రాణమే పోయును

మొక్కలను పెంచాలి
మన ఘనత చాటాలి
అభివృద్ధి పథంలో
చేయిచేయి కలపాలి

--గద్వాల సోమన్న 

0/Post a Comment/Comments