ప్రయోజకుడే "కొడుకు"-గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడు

ప్రయోజకుడే "కొడుకు"-గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడు

ప్రయోజకుడే "కొడుకు"
------------------------------
ప్రయోజకుడే కొడుకు
దిక్కు వాడే కడకు
జీవితాంతం వరకు
ఓ వెన్నెలమ్మ !

ఇంటి యందున జ్యోతి
తెచ్చిపెట్టును ఖ్యాతి
పెంచు కొడుకు పరపతి
ఓ వెన్నెలమ్మ!

కొడుకు గృహముకు రేడు
ఘనుడైన మొనగాడు
తండ్రికిల జతగాడు
ఓ వెన్నెలమ్మ!

కీర్తి తెచ్చే కొడుకు
స్ఫూర్తినిచ్చే కొడుకు
తీపి రసముల చెరుకు
ఓ వెన్నెలమ్మ
--గద్వాల సోమన్న

0/Post a Comment/Comments