జాతీయ శత కవి సమ్మేళనం లో ఈరంకి వారికి సన్మానం

జాతీయ శత కవి సమ్మేళనం లో ఈరంకి వారికి సన్మానం

శ్రీ శ్రీ కళా వేదిక మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాహిత్య అకాడమీ సంయుక్తంగా  నిర్వహించిన జాతీయ శత కవి సమ్మేళనం తేదీ : 21-11-2021 ఆదివారం నాడు తూర్పు  గోదావరి జిల్లా అమలాపురంలోని బి.వి.సి. ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియంలో 
ఘనంగా  జరిగింది.

 తుని పట్టణానికి చెందిన కవి, తెలుగు ఉపాధ్యాయుడు శ్రీ ఈరంకి వీర వెంకట సత్య వర ప్రసాద్ ఈ కార్యక్రమంలో పాల్గొని నా దృష్టిలో కవిత్వమంటే.... అనే కవిత గానం చేసినందుకుగాను ఆయనను శాలువాతో సన్మానించి,  జ్ఞాపిక, ప్రశంసా పత్రమును  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్ పర్సన్ శ్రీమతి పిల్లంగోళ్ల  శ్రీ లక్ష్మి గారు అందించారు.

ఈ సభలో వివిధ ప్రాంతాలనుండి శతాధికంగా కవులు పాల్గొని తమ కవితా గానాన్ని వినిపించి పురస్కారాలు అందుకున్నారు.

 రాష్ట్ర దృశ్య కళా చైర్మన్ శ్రీమతి కుడుపూడి సత్య శైలజ, బి.వి.సి. ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ బోనం సతీష్ గార్లు కూడా  ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.

 శ్రీ శ్రీ కళా వేదిక చైర్మన్ డాక్టర్ కత్తిమండ ప్రతాప్ గారి ఆధ్వర్యంలో జాతీయ, జిల్లా కమిటీ అధ్యక్షుడు మిరప రమేష్ మరియు ఇతర ప్రముఖ సభ్యులు సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతముగా జరిగింది.

0/Post a Comment/Comments