శీర్షిక: చెట్టై జన్మించాలి
రోజురోజుకు తరిగిపోతున్నవి తరువులు
ఆగమాగం అయితున్నవి మన బతుకులు
పుడమిని స్వచ్ఛంగా సహజంగా నిలిపేవి
కలిమి బలిమిని మనకిచ్చి నడిపించేవి
కాలంతోపాటే మనిషి కాలయముడైతున్నడు
పచ్ఛదనాన్ని చంపేస్తూ
నేల ఉసురును పులుముకుని
తన గోతిని తానే తీసుకుని
భవిష్యత్తు లేకుండా విశ్వనాశనానికి తానో సమిధౌతున్నడు
కాలుష్యం ఓవైపు కోరలుచాస్తూ ప్రతాపం చూపెడుతున్నది
ఓజోన్ నేడో డేంజర్ జోన్
సూర్యతాపానికో మాడిమసైపోతున్నడు
తలుచుకుంటే ప్రకృతి కోపానికి ఆహుతులెందరో
ధరణి నేడు విపత్తులతో అతలాకుతలం
అంతుచిక్కని రోగాలొకవైపు దాడి
ఆక్సిజన్ అందక గాల్లో దీపాలైన ప్రణాలు
సహజత్వం నశించి
ప్లాస్టిక్ పువ్వుల పరిమళాలే ఎక్కడైనా
కృత్రిమ మేధస్సు ఎంత పెంచుకున్నా
చివరకు అంతా తుస్సే
నాట్లేసే పొలాల్లో
ప్లాట్లేస్తున్నరు
చెట్టు చేమల్ని మాయంజేస్తున్నరు
గాలాడని మేడల్లో బతుకుపయనం
మనిషే ఓ చెట్టై జన్మించాలిపుడు
సి. శేఖర్(సియస్సార్),
పాలమూరు,
9010480557.
హామీపత్రం:
-------------------
సంపాదకులు గారికి నమస్కారం, ఈ కవిత నా స్వీయరచన, దేనికి అనుకరణ కాదు.