పక్షుల గేయం-గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడు

పక్షుల గేయం-గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడు

----------------------------
పక్షుల గేయం
------------------------------
చిన్నారి కోకిలమ్మ 
చెట్టుమీద  వాలింది
గొంతు వీణ సవరించి
చక్కని పాట పాడింది

పంజరంలో చిలుకమ్మ
తీయగా మాట్లాడింది
తలుపు కాస్త తెరువగా
రివ్వున ఎగిరి పోయింది

అందమైన నెమలమ్మ
పించము విప్పి ఆడింది
అందాలు  ఒలకబోస్తూ
కనువిందే చేసింది

చిన్న పిట్ట వచ్చింది
పుల్లలెన్నో తెచ్చింది
చక్కని గూడు అల్లింది
హాయిగా జీవించింది

కోడిపుంజు కూసింది
జగతిని నిదుర లేపింది
పల్లె ప్రజలకు పుంజమ్మ
అలారంగా మారింది

ఎగురుకుంటూ వచ్చింది
సందేశం గొనితెచ్చింది
ముద్దులొలుకు పావురమ్మ
"విశ్వశాంతి " కోరింది
--గద్వాల సోమన్న

0/Post a Comment/Comments