' హృదయ స్పందన ' పద్య శతకం పుస్తకావిష్కరణ --బాలసాహిత్యవేత్త గద్వాల సోమన్న

' హృదయ స్పందన ' పద్య శతకం పుస్తకావిష్కరణ --బాలసాహిత్యవేత్త గద్వాల సోమన్న

' హృదయ స్పందన ' పద్య శతకం పుస్తకావిష్కరణ
--బాలసాహిత్యవేత్త గద్వాల సోమన్న
----------------------------------------
పెద్దకడబూరు మండల పరిధిలోని హెచ్.మురవణి ఉన్నత పాఠశాలలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న,ప్రముఖ బాలసాహిత్యవేత్త గద్వాల సోమన్న వ్రాసిన 15వ పుస్తకం "హృదయ స్పందన పద్యశతకం" పుస్తకావిష్కరణ గోనెగండ్ల లైబ్రరీలో  వారోత్సవాల ప్రారంభోత్సవంలో ఘనంగా జరిగింది.స్థానిక లైబ్రరీయన్ శ్రీ నీరుగంటి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మండల సర్పంచ్ శ్రీమతి  హేమావతి గారు ,AICA ప్రధాన కార్యదర్శి మరియు FDCA రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు,   కర్నూలు జిల్లా ప్రముఖ బాలసాహిత్యవేత్తలు డా.హరికిషన్ మరియు పుల్లా రామాంజనేయులు గారుల చేతుల మీదగా పుస్తకావిష్కరణ జరిగింది.అనంతరం పుస్తక రచయిత కవిరత్న గద్వాల సోమన్న ను,విచ్చేసిన అతిథులను సన్మానించారు.  తాను రచించిన పుస్తకాలను అందరికీ పంచారు.అటు విద్యాబోధన చేస్తూ..ఇటు మాతృభాష తెలుగుకు ఇతోధికంగా సేవలందిస్తున్న గద్వాల సోమన్న ను పలువురు ప్రశంసించారు. రచయిత మాట్లాడుతూ తెలుగు భాష పరిరక్షణ అందరి బాధ్యత అని గుర్తుచేశారు. గ్రంథాలయాలు విజ్ఞాన బాండాగారాలు అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో అంతయ్య  తెలుగు భాషోపాధ్యాయులు,ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయురాలు టుంకేశ్వరి ,పాత్రికేయులు,, లైబ్రరీ సిబ్బంది ,పుర ప్రముఖులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

0/Post a Comment/Comments