జేబులోని నిప్పుల విరిబోణి(కైతికాలు)రమేశ్ గోస్కుల కైతికాల రూపకర్త

జేబులోని నిప్పుల విరిబోణి(కైతికాలు)రమేశ్ గోస్కుల కైతికాల రూపకర్త

చలనం మరిచాడు
కదలకుండ మారి నేడు
విశ్రాంతి విడిచాడు
విచిత్రంగ మారాడు
పులి లాగున్నటి మనిషి
తోక వెనుక నిలిచె నేడు

కళ్ళ ముందు మాటలు
నిజాయితీ తెలుస్తుండె
అవసరాల తీరు మాట
లప్పుడే జనిస్తుండె
నమ్మితే నట్టేట మునిగి
నగుబాటు మిగిలె నేడు

తిందా మన్న తీరదు
కొంపలన్ని మునిగి నట్లు
నిండా నిద్ర పట్టదు
సమస్యల్ల చిక్కినట్లు
మాయదారి మహమ్మారి
మనుసు నావరించి నట్లు

పక్క రూములో నుండే
పనికి రాని చాటింగ్
ఆపదేమైన వస్తే
సిగ్నల్ తో చీటింగ్
కృత్రిమ స్నేహాల
పరిమళాలు భలేజోరు

తిండి నీరు లేకున్నా
తిప్పలు పడవచ్చంతా
తను మాత్రం లేదంటే
చుర చురలే రోజంతా                         మాయల ఫకీరు ప్రాణ మోలే 
మనిషి బ్రతుకు మారిపోయే

పిల్లలకు గురువైంది
పెద్దలకు పరువైంది
వృద్ధులకుత్తరమైంది
బడ్జెట్ లో బరువైంది
రెప్పలకందమైన కాటుక
మొఖమంతా నిండినట్లైంది

శ్రమనెంతో తగ్గించి
క్రమ శిక్షణ తోసింది
పల్లెటూరు పట్నాలకు
తేడాలను తగ్గించి
అందరికీ సమానమను
హక్కును గెలిపించింది

అంతులేని ఆప్ లతొ
హద్దులను చెరిపింది
ఉపాధులను తుడిచి
ఉప్పెనలను తెచ్చింది
ప్రపంచాన్ని బంధించి
కృష్ణుడల్లె చూపింది

అవసరమే మితి మీరక
వాడితే మతి తప్పక
అందులోనే మునిగుంటె
అనర్ధాలుగును చెప్పక
నిజమే మరి చరవాణి
జేబులోని నిప్పుల విరిబోణి.
      

0/Post a Comment/Comments