"చిన్నారులం"--గద్వాల సోమన్న , గణితోపాధ్యాయుడు

"చిన్నారులం"--గద్వాల సోమన్న , గణితోపాధ్యాయుడు

"చిన్నారులం"
--------------------------------------
కొమ్మ కొమ్మకు పువ్వులం
కమ్మగ పాడే గొంతులం
అమ్మ మోమున నవ్వులం
బొమ్మల వంటి బాలలం

పండు వెన్నెల వెలుగులం
వెండి కాంతుల వన్నెలం
నిండు జాబిలి బుగ్గలం
అందరు మెచ్చే మొగ్గలం

ఇంటిలోన  రాజులం
మింటిలోన తారలం
చంటి పిల్లలం మేం
కంటి కాంతులం మేం

గృహమున మేం వేల్పులం
వనమున మేం మొక్కలం
జగమున మేం భానులం
మనసును ఏలు బాలలం

కన్నవారికి ఆస్తులం
ఉన్న ఊరికి ఆప్తులం
చిన్న పిల్లలం మేం
వెన్నలాంటి మనసులం

--గద్వాల సోమన్న ,
గణితోపాధ్యాయుడు. 

0/Post a Comment/Comments