అంశం కార్తీకమాసం విశిష్టత- --- పేరు అద్దంకి లక్ష్మి ఊరు ముంబై

అంశం కార్తీకమాసం విశిష్టత- --- పేరు అద్దంకి లక్ష్మి ఊరు ముంబై

అంశం  కార్తీకమాసం విశిష్టత
తేదీ 24_11_21   మాసములన్నిటా మహిమాన్వితమై కళకళలాడే కార్తీకము..
   నిర్మలమైన మనస్సుతో హరిహరాదులను ధ్యానించినచో జన్మధన్యమయి మోక్షప్రాప్తి,,,
    పురాణేతిహాసాల వివరణ..

    అజ్ఞాన తిమిరాలను పోగొట్టి జ్ఞాన జ్యోతులను వెలిగించె దీపావళి. పండుగ మరుసటి రోజు      నుండి ప్రారంభము.
     ఈ కార్తీక మాసపు పుణ్య దినాల ఆనందము..

   చాతుర్మాస్య వ్రత దీక్షలు సమాప్తము.
   లయకారుడు శివుని పూజించిన దారిద్రం తొలగి సర్వ సంపదలు..
  ఆదివారంనాడు ఆదిత్యుని పూజించిన ఆరోగ్యము,,
   శివకేశవులను పూజించిన శివ సాన్నిధ్యము..

    సాలగ్రామ దానంతో సకలైశ్వర్యములు..
    కార్తీక పౌర్ణమి జ్వాలా తోరణం దర్శనమే సర్వపాపహరణం.
     పిల్లలు పెద్దలు ఉపవాస దీక్షతో ఊరంతా సందడి
     ప్రతి దినము పండుగే,,

   ఉదయభానుని తో పోటీపడి ముందుగానే లేచి,
   చలికి గజగజలాడుతు  చల్లని నదీస్నానాలు..
  ఆలయానికి వెళ్లి బిల్వార్చనలు ,అమ్మవారికి కుంకుమ పూజలు.
  ఉసిరి చెట్ల కింద కార్తీక  వనభోజనాల సందడి..
  సమాజంలో వర్గ భేదం లేకుండా కలసిమెలసి జీవించాలనే  ఐక్యతా భావం.
   కార్తీక పౌర్ణమి జ్వాలాతోరణ దర్శనం సర్వపాపహరణం..
   దేవాలయంలో
   దీపదానము, సాలగ్రామ దానములతో సకలైశ్వర్యములు..
   ప్రకృతిని దైవంగా పూజించే నాగుల చవితి పండుగ.
 
   పురాణ శ్రవణము,
  శ్రీ హరి కథలు వినుట వలన, కలుగు పుణ్యగతులు.
  అవసాన కాలమున నారాయణ నామస్మరణతోనే  వైకుంఠ ప్రాప్తి గలిగిన అజామిళుని       చరితము,,,
  మూషికము సహితము ముక్తి పొందిన భక్తి మార్గము...
  అనేక కథలతో ఆకట్టుకునే కార్తీక మాస పురాణము
  ఉత్తరాదిన లక్ష్మీనారాయణల వివాహ,, తులసి వివాహం అని జరుపు ప్రసిద్ధి యైన               పండుగ.
  పోలి స్వర్గముతో నదిలో దీపాలను వదిలిన,
  పరిసమాప్తి అయిన
  కార్తీకమాస పుణ్య దినాలు...
  శివకేశవుల అనంతరం  శ్రీ  మహాలక్ష్మిని పూజించే మార్గశిర మాసం ప్రారంభము..
   దినచర్య లోనే దైవాన్ని ఆరాధించే దివ్య పండుగలు..

   పేరు అద్దంకి లక్ష్మి
   ఊరు ముంబై

0/Post a Comment/Comments