Pravahini



అంశం :చీకట్లను తరిమేద్దాం -జ్ఞానజ్యోతులను వెలిగిద్దాం.
శీర్షిక :మానవతా ధర్మాన్ని పాటిద్దాం....

అజ్ఞానాందాకారంలో మునిగిపోతు మానవత్వం కరువై..
చిన్న పెద్ద తేడాలేకుండా కర్కశ మానవ మృగాల వేటలో బలవుతున్న ఆడబిడ్డలను రక్షణ కల్పిస్తూ..
ఇంటా బయట అబలలపై జరుగుతున్న అనాగారికతను రూపుమాపుతూ..

మూఢనమ్మకాలతో కూడిన బాల్య వివాహల పద్ధతులను రూపుమాపుటకు కృషి సల్పుతూ..

ఆధారణకు నోచుకోని వృద్ధాప్య అభాగ్యులని ఆదుకొను మార్గాలను చూచిస్తూ..

విధి వక్రీకరించి, సమాజంచే నిర్లక్ష్యం చేయబడ్డ నిర్బాగ్యులను ఆదరించే చట్టాలను అభివృద్ధి చేస్తూ.

ప్రకృతి వైపరీత్యాల సమయాలలో అనుకోని విపరీత పరిస్థితితులలో మానవత్వం కల్గి కనీస మానవ ధర్మాన్ని పాటింపచేస్తూ..

అన్యాయాన్ని అధర్మాన్ని నిర్ములింపచేస్తూ...
కులమత వర్ణ భేదలులేకుండా సమైక్య భావనను కలగచేస్తూ..

అజ్ఞానందకారంలో మునిగిపోతున్న సమాజాతీరును మార్చుదాం...
అంధకారచీకట్లను తరిమేద్దాం జ్ఞాన జ్యోతులను వెలిగిద్దాం 

వి . కృష్ణవేణి
వాడపాలెం.
9030226222


ప్రక్రియ :వచనం.

0/Post a Comment/Comments