భగవద్గీత(కైతికాలు)కాటేగారు పాండురంగ విఠల్

భగవద్గీత(కైతికాలు)కాటేగారు పాండురంగ విఠల్

నీవు పరబ్రహ్మవు
నీవే పరంధాముడు
నీవు తేజోరూపుడవు
నీవే పరమ పావనుడు
కృష్ణా!ఋషులు చెప్పినదే
మరల నాకు చెప్పుచున్నావు!

మిమ్ములను నిత్యులుగను
భావించెను నారదుడు
ప్రకాశ స్వరూపులుగను
భావించాడు అసితుడు
కృష్ణా!నీవు ఆదిదేవుడవు!
సర్వ వ్యాపాకుడవు!

నీవు జన్మరహితుడివిగ
చెప్పాడు దేవలుడు
నీవు పరమపురుషుడివిగ
తెలిపెను వేదవ్యాసుడు
కృష్ణా!నీవు చెప్పినదాన్ని
నేను విశ్వసిస్తున్నాను!

నిను దివ్యమైనవాడిగ
సమస్త ఋషులు చెప్పిరి
శాశ్వతమైనవాడిగ
దేవర్షులంత చెప్పిరి
కృష్ణా!నీవే దేవతలందరికి
ఆది అయిన వాడవు!

నీవు చెప్పినదంతా
సత్యమనుకుంటున్నాను
నా గురించి చెప్పినది
విశ్వసిస్తున్నాను
కేశవా!నీ సహజ స్వరూపం
నేను తెలుసుకున్నాను!

నీ నిజస్వరూపమును
దేవతలెవ్వరు ఎరుగరు
వాస్తవ వ్యక్తిత్వమును
అసురులెవ్వరు ఎరుగరు
భగవానుడా!నన్ను నమ్ము!
నేను నిన్ను విశ్వసిస్తున్నాను!

ప్రాణుల సృష్టికార్తా!
ఓ భూతభావనుడా!
సకల భూతనాథా!
ఓ పురుషశ్రేష్ఠుడా!
కృష్ణా!సమస్త జీవులకు
నియామకూడవు నీవే!

జగత్పతివి నీవే
నీవే దేవదేవుడవు
పరమాత్మవు నీవే
నీవే జగన్నాథుడవు
కృష్ణా!నీ రూపమితరులకు
దుర్గాహ్యమైనది!

నీ ఐశ్వర్యములను
విస్తారముగా చెప్పుము
నీ మహాత్మ్యములను
వివరంగా తెలుపుము
కృష్ణా!నీ విభూతులను
దయచేసి తెలియజేయుము!

సమస్త లోకములయందు
నువు వ్యాపించియున్నావు
దివ్యమైన విభూతులను
విశ్వమున కలిగున్నావు
కృష్ణా!నీవే వాటన్నింటిని
సంపూర్ణంగా తెలుపుము

0/Post a Comment/Comments