పూలేకు నివాళి

పూలేకు నివాళి

సమాచార హక్కు చట్టం 2005 ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.......

            ఈ రోజు కామారెడ్డి జిల్లా బిక్నూర్ మండల కేంద్రంలోని సిద్ధార్థ విద్యాలయం లో నేడు జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా అఖిల భారతీయ ప్రజా సేవా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది అని జిల్లా ఇంచార్జ్ మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు అంకం శ్యామ్ రావు అన్నారు. ఈ సందర్భంగా అంకం శ్యామ్ రావు మాట్లాడుతూ కులం పేరుతో తరతరాలుగా అణచివేతకు గురవుతున్న బడుగు బలహీన వర్గాల ప్రజలకు జ్యోతిరావు పూలే గారు అండగా నిలిచారని ప్రజలందరికీ చదువు ఎంతో అవసరమని పాఠశాలలను రూపొందించిన గొప్ప వ్యక్తి అని అన్నారు. స్త్రీలకు ఆత్మస్థైర్యం కల్పించి, వారి హక్కుల కోసం పోరాడి, సాధికారత కల్పనకు కృషి చేసిన మహనీయుడు అని అన్నారు. భారతదేశంలో కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి అని సమాజంలో స్త్రీలు విద్యావంతులు కావాలని తన భార్య సావిత్రి బాయి పూలేని పాఠశాలకు పంపించి 1948లో మొట్టమొదటి బాలికల పాఠశాలను స్థాపించి పాఠశాలలో అన్ని కులాల వారికి ప్రవేశం కల్పించి స్వయంగా తన భార్య సావిత్రిబాయి పూలే నీ ఆ పాఠశాలకు మొదటి మహిళా ఉపాధ్యాయురాలు గా నియమించాడని అన్నారు. ప్రతి ఒక్కరు జ్యోతిరావు పూలే ను ఆదర్శంగా తీసుకోవాలని మహనీయులను మరువద్దు అని అన్నారు.

        ఈ కార్యక్రమంలో సమాచార హక్కు చట్టం ప్రతినిధులు కొమ్మరాజుల  శ్రీనివాస్, దుబాసి స్వామి, మోతే లావణ్య, దాసరి నాగరాజు, ధనారపు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

0/Post a Comment/Comments