శీర్షిక: అందమైనది బాల్యం పేరు: సి. శేఖర్(సియస్సార్)

శీర్షిక: అందమైనది బాల్యం పేరు: సి. శేఖర్(సియస్సార్)

శీర్షిక: అందమైనది బాల్యం

చిన్నతనం నిండా
చిలిపితనం నిలిచుంటది
పసివయసు నిండా
తెలియనితనముంటది
అదెపుడు కల్తెరగనిది
ఆటపాటలతో
ఆనందడోలికల్లో
అలరారుతూ..
హాయిగా సాగిపోతుంటది
ఎంచేసినా...ఎక్కడెల్లినా
ఇంకా ఏదో చేయాలనే
అలసటలేని ఆనందం
ఏదేమైనా తెలుసుకోవాలనే
కుతూహలంగా
చైతన్య రథలై సాగిపోతుంటరు
సమస్తం మాకోసమేనంటూ
అన్నింటా మమేకమై
ఆకశంలో పక్షల్లా అలయక
తెలియాడుతరు
అప్పుడప్పుడు
ఒంటరితనం తొంగిచూస్తే
ఒంటరిగా ఓ వైపలా
అనుకోకుండా ప్రమాదపుటంచులకు చేరువౌవుతరు
చేయిచాస్తారు
గుబుగబులుగా 
అందరి ప్రేమనందుకుంటూ
ముందుకెడతారు
తస్మత్ జాగ్రత్త
అందమైనది బాల్యం
అమ్మనాన్నల ఆధరణలో పెరిగితేనే 
ఆ జీవితం 
అందమైన 
నందన వనమౌతుంది

సి. శేఖర్(సియస్సార్),
పాలమూరు,
9010480557.

(బాలల దినోత్సవ సందర్భంగా)

హామీపత్రం:
-----------------
సంపాదకులు గారికి నమస్కారం, ఈ కవిత నా స్వీయరచన, దేనికి అనుకరణ కాదు.

0/Post a Comment/Comments