ప్రాధాన్యత తగ్గిపోతున్న చరిత్ర బోధన

ప్రాధాన్యత తగ్గిపోతున్న చరిత్ర బోధన

చరిత్ర సబ్జెక్ట్ కు అన్యాయం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు చరిత్ర సబ్జెక్ట్ ను తొలిగిస్తాం అని చెప్పడం ఒత్తిడి రావడం తో వెనక్కి తీసుకున్న దానిపై ఇంకా సందిగ్థ నిర్లక్ష్యం కినసాగుతూనే ఉంది
     చరిత్రే మానవ వికాసానికి ఆధారం అందుకే ఇది ఒక ప్రయోగ శాల గా ఒక రాణిగా గుర్తింపు పొందింది
  ఒక జాతి మూలాలు, సంస్కృతి తెలువని పౌరులు ఉన్న సమాజం పతనం వైపు సాగుతుంది
   ఇజ్రాయిల్ ఒక్కటిగా అవటానికి కారణం యూదు చరిత్రే.నేటి పిల్లలు వారి తల్లిదండ్రులు చరిత్ర అన్న సాంఘిక శాస్త్రాలు అన్న ఒక నిర్ల్పిత ధోరణి ఉంది.ఎం.పి.సి,బిపిసి ఈ మధ్య కార్పొరేట్ కళాశాలలు సి.ఏ ముసుగులో ఎం.ఈ.సి కోర్సును తలకెత్తు కుంటున్నాయి
  సివిల్స్ గ్రూప్ పోటీ పరీక్షల్లో ఆర్ట్స్ సబ్జెక్ట్స్ ఎంతో ప్రాధాన్యత ఉంటుంది సివిల్స్ లో చాలా మంది ఆప్షన్స్ గా హిస్టరీ ని ఎన్నుకుంటారు
   ఎంతో ప్రాధాన్యత ఉన్న చరిత్ర సబ్జెక్టు ను తెలంగాణ కానీ ఉమ్మడిగా ఉన్నప్పుడు కానీ కొన్ని కళాశాలల్లో హిస్టరీ బై సివిక్స్ అని పేరు పెట్టి హిస్టరీ సివిక్స్ ఒక్కరే బోధించాలి అని కొనసాగిస్తున్నాయి.అసలు సివిక్స్ మొదటి సంత్సరం సిలబస్ కు హిస్టరీ కి ఏ మాత్రం సంబంధం లేదు మరీనా సిలబస్ సెకండ్ ఇయర్ లో కొన్ని స్వాసంత్రోద్యమ దశలు,తెలంగాణ చరిత్ర తప్ప చాలా వాటికి పొంతన లేదు
అందరి విజ్ఞప్తి వివిధ ఒప్పంద అధ్యపాక సంఘాలు చేసిన విజ్ఞప్తి మేరకు రాజనీతి శాస్త్రం, చరిత్ర  అధ్యాపకుల ను వేరు వేరుగా నియమిస్తాం అని హామీ ఇచ్చినప్పటికీ ఆచారణలో నేటికి అమలు కాలేదు
తెలంగాణ ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టి చరిత్రను కాపాడాలి
ఇంటర్ లో దేనికి అదే ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తే అదనంగా ఒక ఉద్యోగం రావడమే కాకుండా చరిత్ర మరుగున పడకుండా మెరుగు పెట్టినవరం అవుతాం
    మానవాభివృద్ధిలో సైన్స్ తో   సాంఘిక శాస్త్రాల మేళవింపు జరిగితేనే ఉత్తమ సమాజం నిర్మాణం జరుగుతుంది.
 ఏ దేశ చరిత్ర మరుగున పడుతుందో ఆదేశం పతనం అంచుల్లోకి చేరుకుంటుంది
చరిత్ర విలువను గుర్తించి ప్రత్యేక సబ్జెక్ట్ ఉంచవలిసిన అవసరం ఎంతైనా ఉంది
   మొన్న కొందరికి ఇంటర్ మూల్య0కనం లో చరిత్ర బోధించే వారు సివిక్స్ పేపర్ స్ దిద్దినారు దీనితో న్యాయం ఎంతవరకు జరుగుతుంది
    సి.ఇ. సి  అదనంగా సి.ఇ. సీఎచ్ లేదా డిగ్రీ మాదిరిగా బక్కెట్ విధానాన్ని అనుసరిస్తే చాలా బాగుంటుంది
    ఇది చూస్తే చిన్న సమస్యగా అగుపించిన లోతుగా  ఆలోచేసిస్తే ఎంతో ప్రాధాన్యం ఉన్న అంశం.ఒక్కసారి మేధావులు,విద్యావేత్తలు సమగ్రంగా చర్చించి ప్రభుత్వానికి తగుసూచనలు చెయ్యాలి
     వైద్య.ఉమశేషారావు
కాంట్రాక్ట్ సివిక్స్ లెక్చరర్
జి.జె.సి దోమకొండ
కామారెడ్డి జిల్లా
9440408080

0/Post a Comment/Comments