న్యాయ మాత

న్యాయ మాత

న్యాయ మాత

నిను నమ్మి బలయైన బలహీనులెందరో

నమ్మి మెాసపోయి
అడ్డదారులకు చిక్కిన అల్పులెందరో

దేవుడికంటే నీవే సర్వమని
నీ చుట్టూ సంవత్సరాల తరబడి ప్రదక్షిణలు 
చేసి
బ్రతుకులు బుగ్గయిన మెధావులెందరో

నిను నమ్మి అప్పులుపాలయి
జీవితాన్ని,
నమ్మకాన్ని, పోగుట్టుకున్న సామాన్యులెందరో

మమతలు- అధికారాలు -అసమానతలు
ఏవీ నీకు పట్టవని
నీ ప్రాణం న్యాయమని
నీ ఒడికి చేరితే
వత్సరాలకు వత్సరాలు కాలసర్పంగా మింగేస్తున్నా
ఎండిపోయిన ఆకలిగూటికి
గుటక నీరుచేర్చి ఎదురు చూస్తున్నా ... కనికరం రాదా

విజయాలు డబ్బుకేనా| - తొందర| తప్పించుకునే వారికేనా

మా వ్యదలు పట్టవా
మాతా
నీ గుండె కోతే మాది
దయచేసి మాకు జరిపించు
త్వరిత గతిన న్యాయం

రచన
డా|| బాలాజీ దీక్షితులు పి.వి
తిరుపతి
8885391722

0/Post a Comment/Comments