లక్ష్మణ రేఖలు. సహస్ర ముత్యాల హారాలు అవార్డు గ్రహీత బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి . కల్వకుర్తి .నాగర్ కర్నూల్ జిల్లా . తెలంగాణ రాష్ట్రం. సెల్ నెంబర్ 9491387977.

లక్ష్మణ రేఖలు. సహస్ర ముత్యాల హారాలు అవార్డు గ్రహీత బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి . కల్వకుర్తి .నాగర్ కర్నూల్ జిల్లా . తెలంగాణ రాష్ట్రం. సెల్ నెంబర్ 9491387977.

లక్ష్మణ రేఖలు
---------------------
1). చెప్పుడు మాటలు వినకు
      తప్పుడు బాటలో చనుకు
      మంచిచెడులను గ్రహించు
      శాంతం సహనం వహించు !

2). సత్యమునే నిత్యంనీవు పలుకు
      నిదానం ప్రధానం అని తెలుపు
      ఇచ్చిన మాటవిలువ నిలుపు
      మెచ్చేలా నీ నోట నీవే తెలుపు 

3). ఇరుగు-పొరుగును ప్రేమించు
     వారిని అన్నదమ్ములుగా భావించు
ప్రేమామృతమును నీవిక పంచు
నమ్రతతో వారిని దీవించు !

4). సత్య మార్గములో పయనించు
     నిత్యం ఆ దైవమునే పూజించు
     కాయం భుద్భుత ప్రాయం అని భావించు
మోక్ష ప్రాప్తికై ఆ స్వామిని సేవించు!

5). పెద్దల సద్దుల మాటలు వినుము
ముద్దుగ సుద్దులు ఇక కనుము
దేవుడు ఒక్కడే అనుకొనుము
జీవుడు ఎక్కడో కనుగొనుము !

6). తల్లిదండ్రులను పూజించు
     పిల్లల పెద్దలను  ప్రేమించు
      దైవం అప్పుడు కరుణించు
      వైనం వరముల కురిపించు !

7). ఆలమందలను పోషించు
     అందరి సుఖమును ఆశించు
     భగవంతుడు తప్పక కరుణించు
    జగమంతట సిరులను కురిపించు !

8). ధర్మం సత్యం పాటించు
      వేషం మోసం చాటించు
     న్యాయదేవత హర్షించు
     నీతి విలువల వర్షించు !

9). కానల మనము పెంచాలి
      కాలుష్యంను తొలగించాలి
       ప్రకృతి శక్తులు ఇక దీవించు
     తరగని సిరులను అందించు !

10). కన్నవారిని మనం మరవద్దు
       ఉన్న ఊరును జనంవిడవద్దు
       ఎవరితోనూ వైరం వద్ధే వద్దు
       అందరితోనూ స్నేహం ముద్దు !

గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్ నెంబర్.9491387977.
నాగర్ కర్నూల్ జిల్లా.

0/Post a Comment/Comments