లక్ష్మణ రేఖలు. సహస్ర ముత్యాల హారాల అవార్డు గ్రహీత బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి . కల్వకుర్తి . నాగర్ కర్నూలు జిల్లా .తెలంగాణ రాష్ట్రం . సెల్ నెంబర్ .9491387977 .

లక్ష్మణ రేఖలు. సహస్ర ముత్యాల హారాల అవార్డు గ్రహీత బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి . కల్వకుర్తి . నాగర్ కర్నూలు జిల్లా .తెలంగాణ రాష్ట్రం . సెల్ నెంబర్ .9491387977 .

లక్ష్మణ రేఖలు.
---------------------
81). స్కైబర్ నేరస్తుల కనిపెట్టు
       నడిబజారులో నిలబెట్టు
       వారి గుట్టు చేయి నీవురట్టు
       అంతవరకు విడువకు నీ పట్టు

82) గుట్కాలు నీవు తినుట వల్ల
       నీ ఆరోగ్యం అవుతుంది గుల్ల
       ఈ అలవాటును మానుటవల్ల
       ఆరోగ్యవంతుడౌతవ్ నిలువెల్ల

83) కో అని పిలుస్తుంది కొలువు
      కొలువుల వేటలోన నిలువు
      ఇంటర్వ్యూను సందర్శించు
      నీ ప్రతిభను ఇక ప్రదర్శించు!

84). ఓ మానవా నీ చర్యలవల్ల
పుడమి సారం అవుతుంది గుల్ల
అలాంటి తప్పిదాలు చేయకు మల్ల
చేస్తే అవుతుంది నీ సంసారం డొల్ల!

85). వారసత్వం కట్టడాలు
నిర్లక్ష్యం నీడలో శిధిలాలు
పట్టించుకోదు ఈ ప్రభుత్వం
మరెవరు చేయాలిక ఎత్నం !

86) పోటీఆటలో ఓడిపోయాని
       కృంగి కృశించి పోవద్దు నీవు
       మళ్లీ  యత్నిస్తే ప్రయత్నిస్తే
       తప్పక జయం విజయం నీదే!

87) యధార్థం మరి పదార్థం
     విడదీయరాని కవలలు
ముందుగా ఈ సత్యాన్ని గ్రహించు
పసందుగా నిత్యాన్నదానం చేయించు !

88). గోవులున్న చోట ఐశ్వర్యం
       గురువులున్నకడ విజ్ఞానం
       స్త్రీల గౌరవించు కాడ ధర్మం
       ఉండులే అస్థిరంకాక స్తిరం !

89) విష్ణువు అలంకార ప్రియుడు
        శంకరుడుఅభిషేక ప్రియుడు
     వినాయకుడు తర్పణ ప్రియుడు
    సూర్యుడు నమస్కార ప్రియుడు

90). డేటింగ్ యాప్ల మాయలో పడకు
చాటింగ్ గ్రూప్ల వలలో చిక్కకు
అసలే వెళ్ళకు నీవా ఆ ప్రక్కకు
వెళితే పట్టిస్తారు ఇక డ్రగక్కకు !

గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్ నెంబర్.9491387977.
నాగర్ కర్నూలు జిల్లా.

0/Post a Comment/Comments