ఇదేమి చోద్యం ఓ రామా!
------------------------------------
అండ పిండ బ్రహ్మాండ మందున
ఆది అంతం లేని ఆ లోకమందున
కులాస గాను విలాస యాత్ర చేస్తున్న ఆదిదంపతులు శివపార్వతులు ఈ భూమికి మరల మరల రాలేక ప్రతి చోటికి వారు పోలేక ప్రతినిధులుగా సృష్టించిన దేవతలే మన తల్లిదండ్రులు !
అని గుర్తించి తెలిపినారు లే మన పెద్దలు అందరూ రూ!
వారేగా మన మాతా పితలు
వారికి కలిగించవద్దు వెతలు
ప్రత్యక్ష దైవాలుగా వెలసిరి
ఈ భువిలో మన అమ్మనాన్నలు సహజీవన దాంపత్యానికి కాసి పూసిన కొమ్మ్మా రెమ్మలు మన ముద్దు ముచ్చట తీర్చేటి ఓదార్చేటి అమ్మానాన్నలు!
ఆ తల్లిదండ్రుల గర్భమందున పుట్టిన పుత్రులు కొందరు పుట్టెడు దుఃఖం కలిగిస్తున్నారు ఆస్తిపాస్తుల కై ఆ అన్నా తమ్ముళ్లు ఆ ఇంటి దిమ్మెల కూల్చేస్తున్నరు ఇదేమి చోద్యం ఓ రామా వారిని సరి చేయగలేమా?
తోడబుట్టిన ఆడబిడ్డలు మేమేమీ తక్కువ అ తిన్నామా అంటూ ఉమ్మడి గుమ్మడి కుటుంబాలను చిన్నాభిన్నం ఏం చేస్తున్నారు ఆ కొంపలకు నిప్పేట్టేస్తున్నరు.
ఇంట్లో నుంచి వారిని నెట్టేస్తున్నారు
ఇదేమి చోద్యం ఓ రామా? మనం వారిని సరి చేయగలేమా?
ఆస్తులకై మరికొందరు పుత్రులు అదరక బెదరక హత్యలు చేస్తున్నారు వారికి వంత పాడుతూ కొందరు పుత్రికలు దరహాసంతో దరువు వేస్తున్నారు. అవకతవక ఈ పనులకు మీరు అంతం పలకండి మీ పంతం వీడండి
అనురాగాలను ఆప్యాయతలను ఆ అమ్మానాన్నలకు పంచండి వారి కష్టనష్టాలకు తెర దింపండి.
అప్పుడు మీ లోగిలి అవుతుంది మన ఆనందాలకు నిలయం ఎన్నడు ఎప్పుడు ఎవరు మరువని అనుబంధాలకు అది వలయం.
గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్ నెంబర్.9491387977.
నాగర్ కర్నూల్ జిల్లా.