అంతర్వాణి అంటే? (వ్యాసం). బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి . కల్వకుర్తి . నాగర్ కర్నూల్ జిల్లా. తెలంగాణ రాష్ట్రం . సెల్ నెంబర్.9491387977.

అంతర్వాణి అంటే? (వ్యాసం). బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి . కల్వకుర్తి . నాగర్ కర్నూల్ జిల్లా. తెలంగాణ రాష్ట్రం . సెల్ నెంబర్.9491387977.

అంతర్వాణి అంటే ఏమిటో మీకు తెలుసా? (విచక్షణ వ్యాసం)
----------------++++++----------------
ప్రకృతిలోని ప్రతి ప్రాణిలోనూ అంతరాత్మ, అంతర్శక్తి,, అంతర్వాణి అను మానసిక శక్తులు తప్పకుండా ఉంటాయి. అయితే కొందరు ఇలా మానవ హృదయంలో నిక్షిప్తమైన ఈ అంతర్గత శక్తులను గుర్తించరు. ఒకవేళ అ గమనింపుకు వచ్చినా పట్టించుకోరు. ఒకవేళ  పట్టించుకున్నా పరిశీలించరు.
            మనం చాలాసార్లు అనేక విషయాలలో మనకు తెలియకుండానే అంతర్వాణి మాటను వింటుంటాం. ఈ అంతర్వాణినే అంతరాత్మ అని కూడా అంటుంటాం. మనం చేసే మంచి పనికి, చెడ్డపనికి మనలోని అంతరాత్మ స్పందిస్తూ తగు సలహాలు ఇస్తూ ఉంటుంది. మహా యోగీశ్వరులు దీనికే హృదయ కమలం అది కూడా చెబుతూ ఉంటారు.
             ఒకే రోజున మనలను గుడి వద్ద పదిమంది బిచ్చగాళ్ళు ధర్మం చేయండి బాబయ్యా అని అడుగుతుంటారు . మనం లేదు లేదు అంటూనే ఒకరిద్దరికి ధర్మ చేస్తాము. అంత మంది నీ కాదని ఏ ఒక్కరికో ఎందుకు ధర్మం చేశాం? అంటే మనం మనలోని అంతర్వాణి మాటను అంగీకరించామని అన్నమాట.
     మనం మన బంధువుల వద్ద కానీ, మిత్రుల వద్ద కానీ అప్పు ఆడగడానికో, లేక ఇచ్చిన బాకీని తీసుకొని ని రావడానికో బయలుదేరు తుంటాం. మనలోని అంతర్వాణి పని జరగదని చెప్పటం దండుగ అని చెబుతుంది. అయినా మనం బయలుదేరుతాం. తీరా వెళ్లేసరికి కి బాకీ అడగాల్సిన బంధువు కానీ మిత్రులు కానీ బాధ లోనే ఉంటారు. మనల్ని చూడగానే బావురుమని అబ్బుకుంటారు. నోరు మూసుకొని తిరిగి వెనక్కి
 వస్తాం. లేదా మనం వెళ్లేసరికి మనకు కావలసిన వ్యక్తి ఇంట్లో ఉండరు. ఏదో ఒకటి జరిగి మన పని పూర్తి కాదు. మనిషిని మునుముందుగా హెచ్చరించేదే అంతర్వాణి.
సాహసా విధాదీత తనక్రియాం!
అవివేఈ పరమావదాం పదం!
అన్నారు మన పెద్దవాళ్లు కూడా"ఏ పని చేసినా కాస్త ఆలోచించి చేయరా"అనే మాటను సదా మనం వింటుంటాం. ముందుకుదూకబోయే ముందు కాస్త అంతర్వాణిని గమనించు . నీకు నీవే రాజువై పోతావు. అన్నింటా విజయం సాధిస్తావు. నీకు ఇష్టం ఉన్నా కష్టమైనా అప్పుడప్పుడు ఆర్ష విజ్ఞానం గురించి కాస్త ఆలోచించు. మన భారతీయ తత్వ జ్ఞానం గురించి కాస్తంత అయినా తెలుసుకో.
         మనం చేసే కొన్ని తప్పుల పనులకు మనలోని వాణి మనల్ని హెచ్చరిస్తూ వద్దు వద్దు అని
 చెబుతూ ఉంటుంది. దాన్ని మనం లెక్క చేయం. మన అంతరాత్మ మాట విననందుకు ఫలితం తరువాత తెలుస్తుంది. ఏడుస్తాం కాకా వికలమై బాధపడతాం. రక్షించే వారి కోసం ఎదురు చూస్తాం. ఎంతో నష్టపోతాం. కాన అంతర్వాణి గమనించి నడుచుకుంటే జీవితాన మనకు అన్ని విజయాలే తప్ప అపజయాలు అసలు సంభవించాలని తెలుసుకోవాలి.

గుర్రాల లక్ష్మారెడ్డి. కల్వకుర్తి.
నాగర్ కర్నూలు జిల్లా.
సెల్ నెంబర్.9491387977.

0/Post a Comment/Comments