"సిరివెన్నెల" కు నివాళి! ......ఈరంకి

"సిరివెన్నెల" కు నివాళి! ......ఈరంకి

*శీర్షిక : "సిరివెన్నెల"కు నివాళి* 

విరించిలా విరచిస్తూ
కవన విపంచికవైనావు!
తెలుగు సినీ జగత్తులో
సిరి వెన్నెలలు కురిపించావు!

జగమంత కుటుంబం 
నాదంటూ పలికావు!
ఏకాకి జీవితం నాదంటూ
తరలి పోయినావు!

పాండిత్యాన్ని, సాహిత్యాన్ని
మూటగట్టి 'భరణి'వైనావు!
తెలుగునాట వెదజల్లుతూ
'సిరి వెన్నెల ' వైనావు!

నీ కవనంలో....
సిరివెన్నెలలు కురవడమే కాదు
రుద్ర వీణ కూడా మ్రోగింది
శ్రుతి లయలు నడిచాయి
స్వర్ణ కమలాలు విరిసాయి

పాటలతో చక్కని చిక్కని
పద సంపదకు పట్టం గట్టావు
సినీ సాహిత్యంలో కూడా
కీర్తి శిఖరమై ఎదిగావు

తెల్లారింది లేవండోయ్! 
కొక్కొరొక్కో..! అంటూ
అందరినీ మేలుకొలుపి
నీవు అస్తమించినావు!

( తేదీ : 30-11-2021 న ప్రముఖ సినీ కవి, శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి ఆకస్మిక మరణానికి  చిరు నివాళిగా  నా కవితాశ్రుబిందువు ఈ రచన)

 *ఈరంకి...✍️* 

E.V.V.S. వర ప్రసాద్,  
తెలుగు ఉపాధ్యాయుడు,
ఊరు : తుని.
జిల్లా : తూర్పు గోదావరి
చరవాణి : 8019231180

0/Post a Comment/Comments