వృక్షం ఆవేదన

వృక్షం ఆవేదన

ఎక్కడ ఓ మనిషి
నేను లేని నువ్వు
నీడనై తోడునై
నీ జాడనై వస్తున్నా
జాలి లేని రాతి గుండె
నీదిగా సరిపెట్టుకోనా
చెమ్మగిల్ల కనులులేక
తిరుగుబాటు చెయ్యలేక
నిర్దయగా నువ్వు నన్ను ముక్కలు చేస్తున్న
ప్రతిక్షణం నీకు నేను తోడుగనె ఉన్నాగ
ప్రశ్నించే స్వరములేక
ధిక్కరించ కరములేక
నీ ఆనందపు డోలికనై
నీ సుఖాల వెదికనై
ఊయలనై పానుపునై
సుఖాసీన పీటికనై
ఎక్కడ  ఓ మనిషి
నేను లేని నువ్వు
నా వాయువు నీ ఆయువు
నా ప్రాణమె నీ మనుగడ
నువు నిర్దయగ విరిచేసిన
ధనముగ తిరిగొచ్చిన
ఆకలితో నను చేరిన
ఫలములె నీకిచ్చిన
నీ ఆహరపు ధాన్యాన్ని చి
సేదతీర గాలినిచ్చి
నీడనై గూడునై
మోడునైన సేదతీర్చ
ఎక్కడ ఓ మనిషి
నేనులెని నువ్వు

ఇడుకుల్ల గాయత్రి

 ఇది నా యొక్క స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను.

0/Post a Comment/Comments