సిరివెన్నెల-కవి కోకిల
----------------------------------
సిరివెన్నెల కరిగిపోయింది
విరి మాలిక వాడిపోయింది
పాటల నర్తనశాలలో
ఆట ఆగిపోయింది
పాటల గగన సీమలో
తారక రాలిపోయింది
మాటల పూదోటలో
గొంతుక ఎండిపోయింది
తెలుగు కవన వనంలోంచి
కవి కోకిల వెళ్ళిపోయింది
రవి సిరివెన్నెల శకం
అంతరించిపోయింది
కలం కన్నీరు పెడుతుంది
గళం విలవిలాడుతోంది
"సీతారామ శాస్త్రీ" గూర్చి
అక్షరం కుమిలిపోతుంది
అక్షరాల కోటలో
సిరివెన్నెల మహా రేడు
తెలుగు పాటలు మాంత్రికుడు
నేడు ఈ జగాన లేడు
--గద్వాల సోమన్న