మా జీవితాలు రాలిపోతున్నాయి.

మా జీవితాలు రాలిపోతున్నాయి.

మా జీవితాలు రాలిపోతున్నాయి.
.................................
మా జీవితాలు రాలిపోతున్నాయి
శిధిలమవుతున్న వ్యవస్థ నిర్మాణం లో
కుల దురహంకార కత్తుల స్థైర్య విహారంలో
ధన దాహం రాబందుల రాక్షస రాజ్యంలో
కూలుతున్న మానవతా గోడల కిందపడి
మా జీవితాలు రాలిపోతున్నాయి

అన్నం పెట్టిన చేతులను తెగనరికే రాజ్యంలో 
రైతుల రక్తమాంసాలు కరిగించి మట్టిని పెకిలించి
ఒక్కో గింజకు దోసెడు చెమట నెత్తురు పోసి
దగాపడిన రైతన్న దిగాలు పడకుండా కోట్ల మందికి
నేడు పుట్లను పండిస్తూ పంట రాశుల పైన ప్రాణాలను రాలుస్తూ
మా జీవితాలు రాలిపోతున్నాయి

కాషాయపు కమలాల నిప్పుల కుంపటి లో పడి
మాటేసిన మనువాదం పడగ నీడ కింద
రాకాసి కోరల మతమౌఢ్యపు మంటల్లో
దళిత జాతి నరమేధం నలుదిక్కుల వ్యాపిస్తూ
మతం మత్తు కులం కుళ్ళు లో ప్రవహించే ప్రవాహాల్లో
మా జీవితాలు రాలిపోతున్నాయి

బహుజన వాదం నాదని బంధుత్వం కలుపుకొని
కమ్యూనిజం పేరుచెప్పి కడుపులో కత్తులు దాసి
విలువలు పలువలు పోసి మాటల గారడీ చేసి
మాయదారి మల్లన్న సొంపైన మాటల్లో పడి
దళిత గనులు దిన జనులు, చాందస మంటల్లోన
మా జీవితాలు రాలిపోతున్నాయి

ప్రశ్నించే కంఠాలకు తుపాకుల ను ఎక్కు పెట్టి
రాజ్యం చేసే హింసకు రంగుల సింగిడి పోసి
పరిపాలించి పాలెగాళ్ళ వెంగిలి మెతుకుల కోసం
దళిత బహుజన వాధం బూర్జువ చెరలో పడి
కారు చీకట్లో నా జటిలమైన బతుకులతో
మా జీవితాలు రాలిపోతున్నాయి 

రచన:కాలం.,,(10-12-2021 .3am-)   
                       పురుషోత్తం సతీష్
                        కరీంనగర్
                         సెల్.8897430904.

0/Post a Comment/Comments