రాలిపోయిన నల్లజాతి నక్షత్రం...పోలయ్య కవి కూకట్లపల్లి...అత్తాపూర్ హైదరాబాద్

రాలిపోయిన నల్లజాతి నక్షత్రం...పోలయ్య కవి కూకట్లపల్లి...అత్తాపూర్ హైదరాబాద్

రాలిపోయిన నల్లజాతి నక్షత్రం

మానవ హక్కుల మహానేత
మొట్టమొదటి ఆంగ్లోఆర్చిబిషప్
డెస్మండ్ టుటు అస్తమయం...

దక్షిణాఫ్రికా అధ్యక్షుడు 
27 సం.రాలు జైలు జీవితం
గడిపిన నెల్సన్ మండేలాకు
ప్రాణమిత్రుడు‌ అహింసావాది
దివికేగిన దక్షిణాఫ్రికా దిక్సూచి టుటు

దక్షిణాఫ్రికాలో జాతివివక్షతతో
ఆంగ్లేయుల అణచివేతలతో 
నరకాన్ననుభవించే నల్లజాతీయుల
స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకోసం
సమానత్వం సౌభ్రాతృత్వాలకోసం
బానిసత్వం నుండి విముక్తి కోసం
స్వేచ్ఛావాయువుల్ని పీల్చేరోజు కోసం

అలుపెరుగని పోరాటం చేసిన 
మహాయోధుడు మఠాధిపతి
ప్రపంచ నేత స్పూర్తి ప్రదాత
శాంతి బహుమతి గ్రహీత
ఎందరికో ఆదర్శం డెస్మండ్ టుటు

ఎండిన చీకటి నిండిన 
ఎందరో బడుగు బ్రతుకుల్లో 
వెన్నెల వెలుగులు నింపిన
ఒక ఆశాజ్యోతి ఆరిపోయింది
ఒక నల్లజాతి నక్షత్రం రాలిపోయింది

ప్రేమామయుడు నిగర్వి నిత్యం
నవ్వులు రువ్వే నిర్మలమూర్తి
24 ఏళ్ళు క్యాన్సర్ వ్యాధితో
తీవ్రపోరాటం చేసి చేసి చివరికి
ఓడిపోయి ఒరిగిపోయిన
కన్నుమూసి కనుమరుగైన
ఆ శాంతిదూత టుటు ఆత్మకు 
శ్రద్దాంజలి ఘటిస్తు అందిస్తున్న అక్షరనివాళి...

రచన. పోలయ్య కవి కూకట్లపల్లి అత్తాపూర్ హైదరాబాద్0/Post a Comment/Comments