మాటే మనసుకు సాక్షి

మాటే మనసుకు సాక్షి


            మాటే మనసుకు సాక్షి
 
ఆనందం ఆవిరయినా
అనుభూతి మిగిలే ఉంది
ఆశ్చర్యం తరలిపోయినా
తన్మయం తడుముతూనే ఉంది
అవమానం మరిచిపోయినా
అవహేళన వీడకుంది
దుఃఖం ఆగిపోయినా
బాధ భారమయ్యింది
సమయం కరిగిపోయినా
మరువలేని  జ్ఞాపకంగా
మాటే మనసుకు సాక్షి.
మనసు కలతగా ఉన్నా..
లక్ష్యం చేరుకునే బలం కావాలన్నా..
తెలుగు అక్షరాల కూర్పు
మంచి మాటలు, అల్లికలు ఆహ్లాదం పొందాలన్నా..ప్రపంచ విషయాలు తెలుసుకోవాలన్నా..
సమానత్వంతో చేతులు కలిపిన సభ్యులతో స్నేహం చేయాలన్నా..
పెదవులపై మాట్లాడే
మాటలచే నవ్వులు పువ్వులు విరియాలన్నా..
ఈ జీవన చదరంగం లో
మంచి మాటలు  మునకలు వేయనిదే.. మానవ జన్మ అర్థంసార్థకం కాదని.. ప్రవహిణి వెబ్ పత్రిక తెలియజేసే మాటే మనసు సాక్షి.

రచయిత : జరుగుమల్లి వీరయ్య   కలికిరి కొటాల, చిత్తూరు జిల్లా,
ఆంధ్ర ప్రదేశ్.
చరవాణి:8106974626

హామీ పత్రం: ఇది నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను.

 

0/Post a Comment/Comments