అమెరికాలోని ప్రసిద్ధ అమెరికా తెలుగు సంఘం ప్రపంచంలో ని వివిధ రంగాలలోని తెలుగు ప్రముఖులకు వారి సేవలను గుర్తించి ఈ రోజు హైద్రాబాద్ లోని రవీంద్రభారతిలో 26.12.2021 సాయంత్రం 4 గంటల నుండి 9 గంటల వరకు జరిగే కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని దేవాయి పల్లి గ్రామానికి చెందిన శాస్త్ర వేత్త మరియు సఫల ఫార్మా సంస్థల యజమాని డాక్టర్. పైడి ఎల్లారెడ్డి గారు ఈ అవార్డుకు ఎంపిక అవ్వడంతో కామారెడ్డి జిల్లా వారు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు .కామారెడ్డిలో ని ప్రముఖ విద్యాసంస్థలు అయిన సాందీపని లో కూడా భాగస్వామిగా విద్యారంగంలో ను కూడా తనదైన ముద్ర వేస్తున్నారు దిగువ మధ్యతరగతి వ్యవసాయిక కుటుంబం లో పుట్టి స్వయం కృషితో తెలంగాణ రాష్ట్రం ఉన్నతస్థాయికి ఎదిగి స్థానికుల కు ఉద్యోగ అవాకాశాలు,సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు
ఈ అవార్డ్ అందుకోవడం కామారెడ్డి జిల్లా ప్రజలకే గర్వకారణం.ఇట్టి సన్మానానికి ఎంపిక అయినందులకు సాందీపని విద్యాసంస్థల తోటి డైరెక్టర్లు డాక్టర్.శివప్రసాద్,నవీన్ రెడ్డి,ప్రభాకర్,పెంటయ్య,జనార్దన్ రెడ్డి,అశోక్ రావు,కృష్ణమూర్తి,హారస్మరన్ రెడ్డి,రాజగంభీర్,బాలాజీ,శేషారావు తదితరులు అభినందన లు తెలుయచేసినారు