చేరనీయకు...చేరనీయకు
చేరనీయకు...చేరనీయకు
నీ పంచన నవ్వించి నమ్మించి
నట్టేటముంచే నయవంచకుల్ని...
దూరనీయకు...దూరనీయకు
నీ కళ్ళల్లోకి రౌద్రాన్ని
నీ చేతుల్లోకి రాక్షసత్వాన్ని
నీ మాటల్లోకి కౄరత్వాన్ని
నీ బ్రతుకులోకి దారిద్ర్యాన్ని
నీ అంతరంగంలోకి అరిషడ్వర్గాల్ని
నీ తలపుల్లోకి భయాన్ని నిరాశావాదాన్ని...
పారనియ్యకు...పారనియ్యకు
పాదరసం లా నీ పాదాల్లోకి...పిరికిదనాన్ని...
చల్లారనీయకు...చల్లారనీయకు
నీ ఎదలో ఉప్పొంగే ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని...
మారనీయకు...మారనీయకు
నీ సద్బుద్ధిని మంచితనాన్ని మానవత్వాన్ని...
జారనియ్యకు...జారనియ్యకు
నీ చేతుల్లోనుండి అందిన బంగారు అవకాశాల్ని...
కోరనియ్యకు...కోరనియ్యకు
ఆ పరమాత్మను శాశ్వతమైపోవాలని నీ శరీరాన్ని...
ఊరనియ్యకు...ఊరనియ్యకు
నీ మదిలో ఉద్రేక పూరిత ఉన్మాద భరిత వెర్రి ఊహల్ని...
రచన.పోలయ్య కవి కూకట్లపల్లి అత్తాపూర్ హైదరాబాద్