శీర్షిక: స్నేహామృతం
స్నేహం
మనసులో పెనవేసుకుని
మమతానురాగాలతో
ఎల్లప్పుడు అదో ధైర్యమై
ఆలోచనల రూపాన్ని ముందు పరచుకొని మలచుకునే దగ్గరితనమది
సంతోషసముద్రం ఆనందమనే అలలతో నిశ్చలంగా నిర్భయంగా
సమస్యేదైనా పరిష్కారమై పరిమళించేదది
ఇష్టాలను కష్టాలను నష్టాలను
త్రివర్ణ కేతనంగా కలిసి గెలిచేదదే గెలుపునిచ్చేదదే
నింగైనా నేలైనా ఒక్కటి చేసే దారదే నడిచే జాడదే
హితుల జ్ఞాపకాలు మదిలో మెదిలిన వేళలో
వేల నక్షత్రాల కాంతిలా చైతన్యం నింపేదది
ఎంతెదిగినా
బాల్యాన్ని ముందు పరిచేదది
మనసారా మాటలుకలిపేదది
హాస పరిహాసాల మేళవింపై
చెదరని దరహాసాన్ని పెదవులపైనే కాదు
హృదయాన్ని నింపే సౌజన్యం
దశ దిశలను నిర్ధేశించేదదే
బలాన్ని బలహీనతను తెలిపి గెలుపునిచ్చే విశ్వాసమదే
అదెపుడు మరపురాని మధురానుభూతి
తనువులో శ్వాసున్నంతవరకు
శాశ్వతబంధమై నిలిచేదే స్నేహం
సి. శేఖర్(సియస్సార్),
పాలమూరు,
9010480557.
హామీపత్రం:
-----------------
సంపాదకులు గారికి నమస్కారం, ఈ కవిత నా స్వీయరచన, దేనికి అనుకరణ కాదు.