అగ్నిగుండంలో అన్నదాతలు....
గుండెల్లో...
ఎన్ని అగ్నిపర్వతాలు బద్దలైతేనో...
కళ్ళల్లో...
ఎన్ని కన్నీటి సముద్రాలు ఉప్పొంగితేనో...
కట్టుకున్న...
ఎన్ని ఆశల ఆకాశహార్మాలు
నిట్టనిలువునా కుప్పకూలితేనో....
కన్న...ఎన్ని కమ్మనికలల పచ్చనిపంటల్ని
మిడిమాలపు మిడతలు దండెత్తి
మింగివేసుంటేనో....
ముందు భవిష్యత్తంతా
అంధకారమేనన్న భయంతో
గుండెల్లో...
ఎన్ని అగ్నిపర్వతాలు బద్దలైతేనో...
కళ్ళల్లో...
ఎన్ని కన్నీటి సముద్రాలు ఉప్పొంగితేనో...
కట్టుకున్న...
ఎన్ని ఆశల ఆకాశహార్మాలు
నిట్టనిలువునా కుప్పకూలితేనో....
కన్న...ఎన్ని కమ్మనికలల పచ్చనిపంటల్ని
మిడిమాలపు మిడతలు దండెత్తి
మింగివేసుంటేనో....
ముందు భవిష్యత్తంతా
అంధకారమేనన్న భయంతో
కారుచీకటిలోఎన్నో కన్నీటిచుక్కలు రాల్చితేనో...
చాటుమాటుగా కాటువేసే
చాటుమాటుగా కాటువేసే
కరోనాభూతంలా...నల్ల త్రాచుల్లా
మూడు నల్లచట్టాలు..
ఎంతగానో భయభ్రాంతులకు గురిచేస్తేనో....
అన్నదాతల...
పచ్చని బ్రతుకులు ఆరని అగ్నిగుండాలైతేనో
నిగ్రహంకోల్పోయి ఇలా ఉగ్రరూపం దాల్చేది
సన్న చిన్నకారు రైతుల పొట్టగొట్టి
కార్పొరేట్ సంస్థల కడుపులు నింపే...
ఎర్రతీవాచీలు పరచే...
ఈ మూడు నల్లచట్టాలు మాకెందుకని...
కాకులను కొట్టి గద్దలకేసే ఈ ద్వందవైఖిరికి
నిరసనగా....రోడ్డు రోకోలు ధర్నాలు చేస్తుంటే...
రోడ్లను సరిహద్దుల్ని దిగ్బంధం చేసినా...
నిర్దయతో నిర్భంధించినా...
కర్షక కార్మిక శక్తులన్నీ ఒక్కటై...
ముక్తకంఠంతో నిరసిస్తూ...నిప్పులు కురిపిస్తూ...
ఢిల్లీపీఠం దద్దరిల్లేలా దిక్కులు పిక్కటిల్లేలాా...
కుంభకర్ణులు నిద్రలేచేలా....
మూడు నల్లచట్టాలను రద్దుచేసేలా....
ధర్మయుద్దానికి సిద్ధమై... ఉద్యమ కెరటాలైై...
ఉవ్వెత్తున ఎగిసిపడుతూ...
మూడు నల్లచట్టాలు..
ఎంతగానో భయభ్రాంతులకు గురిచేస్తేనో....
అన్నదాతల...
పచ్చని బ్రతుకులు ఆరని అగ్నిగుండాలైతేనో
నిగ్రహంకోల్పోయి ఇలా ఉగ్రరూపం దాల్చేది
సన్న చిన్నకారు రైతుల పొట్టగొట్టి
కార్పొరేట్ సంస్థల కడుపులు నింపే...
ఎర్రతీవాచీలు పరచే...
ఈ మూడు నల్లచట్టాలు మాకెందుకని...
కాకులను కొట్టి గద్దలకేసే ఈ ద్వందవైఖిరికి
నిరసనగా....రోడ్డు రోకోలు ధర్నాలు చేస్తుంటే...
రోడ్లను సరిహద్దుల్ని దిగ్బంధం చేసినా...
నిర్దయతో నిర్భంధించినా...
కర్షక కార్మిక శక్తులన్నీ ఒక్కటై...
ముక్తకంఠంతో నిరసిస్తూ...నిప్పులు కురిపిస్తూ...
ఢిల్లీపీఠం దద్దరిల్లేలా దిక్కులు పిక్కటిల్లేలాా...
కుంభకర్ణులు నిద్రలేచేలా....
మూడు నల్లచట్టాలను రద్దుచేసేలా....
ధర్మయుద్దానికి సిద్ధమై... ఉద్యమ కెరటాలైై...
ఉవ్వెత్తున ఎగిసిపడుతూ...
ఉద్యమిస్తున్న
రైతన్నలకు మద్దతిద్దాం...
మానవత్వాన్ని చాటుకుందాం....
ఔను ఈ మూడు చీకటిచట్టాలతో
మున్ముందు రైతులకు ముప్పే...పెనుముప్పే ...
కరుణ దయ జాలిలేని నేతలకు కలిగించాలి కనువిప్పే ...
(నేడు శ్రీ చరణ్ సింగ్ జాతీయ రైతుదినోత్సవం
సందర్బంగా అన్నదాతలకు నా అక్షర హారతి)
రైతన్నలకు మద్దతిద్దాం...
మానవత్వాన్ని చాటుకుందాం....
ఔను ఈ మూడు చీకటిచట్టాలతో
మున్ముందు రైతులకు ముప్పే...పెనుముప్పే ...
కరుణ దయ జాలిలేని నేతలకు కలిగించాలి కనువిప్పే ...
(నేడు శ్రీ చరణ్ సింగ్ జాతీయ రైతుదినోత్సవం
సందర్బంగా అన్నదాతలకు నా అక్షర హారతి)