మమతల మాగాణి - స్నేహం

మమతల మాగాణి - స్నేహం


అంశం : స్నేహం
శీర్షిక : మమతల మాగాణి - స్నేహం

      మమతల మాగాణి - స్నేహం

ఆపద వచ్చి
అలసిన వేళ జోల పాట పాడిన అమ్మలా..
తగవులాట వచ్చి
అలిగిన వేళ అలక తీర్చిన నాన్నలా..
అనునిత్యం
అనురాగాలకు, ఆప్యాయతలకు,
అర్థం చెప్పిన జీవితం - స్నేహితుల జీవితం.
శాంతి సౌభాగ్యాలు ఒకరికొకరికి కలగాలని
ఆప్యాయత, అనురాగాలను దారాలు పెనవేసినట్లు
ప్రేమానుబంధాలను ముడివేసి
అనుబంధాలకు వారధిగా
ఆప్యాయతలకు సారథిగా
ధరణి లో కలిసి ఉండే జీవితం - స్నేహితుల జీవితం.
పోట్లాటలు.. అలకలు..
బుజ్జగింపులు.. ఊరడింపులు..
చిన్ననాటి మధుర గుర్తులు..
తిరిగిరాని ఆ రోజులను స్మరించుకుంటూ..
మమతల మగాణి లో పువ్వులు లాగా..
అనుబంధానికి ప్రతిరూపంగా..
అనురాగానికి ప్రతీకలుగా..
స్నేహా మధుర రాగాలని నింపుకుని వెదజల్లుతున్న సువాసనలు గా..గల జీవితం - స్నేహితుల జీవితం.
నవ్వుల్లో, బాధల్లో చెదరని
నడకైనా, పరుగైనా ఆగని
పూరి గుడిసెలని, మేడలని చూడని
బడిలోను, గుడిలోను తుంటరి
ఆటైనా  పాటైనా ఉరకలెత్తి
ఎండలోను, వానలోను గొడుగు పట్టి
ప్రేమైనా, విరహమైనా విడిపోని
వేడుకల్లో, కొట్లాటలో తోడు నిలిచి
గెలుపోటముల్లో వెన్నుతట్టి నిలిచే జీవితం - స్నేహితుల జీవితం.
కళ్ళు నిండా కారే కన్నీళ్ళు విలువైనవి.
ప్రేమగల హృదయం అందమైనది.
స్నేహితుల గల జీవితం అద్భుతమైనది.

రచయిత : జరుగుమల్లి వీరయ్య.  
                 కలికిరి చిత్తూరు జిల్లా
చరవాణి : 8106974626

హామీ పత్రం : ఇది నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను.





 

0/Post a Comment/Comments