మల్లె తావిలా గుప్పుమనిన ' మానవత్వం ' (అన్నదానం మరియు నిత్యావసర వస్తువులు పంపిణీ),-,గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడు

మల్లె తావిలా గుప్పుమనిన ' మానవత్వం ' (అన్నదానం మరియు నిత్యావసర వస్తువులు పంపిణీ),-,గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడు

మల్లె తావిలా గుప్పుమనిన  ' మానవత్వం '
(అన్నదానం మరియు నిత్యావసర వస్తువులు పంపిణీ)
-------------------------------
పెద్దకడబూరు మండల పరిధిలోని హెచ్.మురవణి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న గద్వాల సోమన్న ఆధ్వర్యంలో  జీవన జ్యోతి అనాథ వృద్ధాశ్రమం, అదోనిలో అన్నదానం, నిత్యావసర వస్తువుల పంపిణీ జరిగింది.కన్న పిల్లలే కన్నవారిని  
అనాథ ఆశ్రమాలలో వదిలేసి భాద్యతరహితంగా చేతులు దులుపుకుంటున్న తరుణంలో  "పూవులా మానవత్వం పరిమళించింది".
 మేము సైతమూ అంటూ నడుం బిగించారు.శ్రీ మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు AICA ప్రధాన కార్యదర్శి మరియు FDCA రాష్ట్ర అధ్యక్షులు,లైబ్రరీన్ శ్రీ నీరుగంటి వెంకటేశ్వర్లులతో  జతకట్టి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.తమ విలువైన ఊరడించే, ఆత్మ స్టైర్యాన్ని పెంచే,భరోసా నిచ్చే ప్రేమపురిత మాటలతో నూతన ఉత్తేజాన్ని నింపారు.ఈ కార్యక్రమంలో కరణం పాపన్న, ఈశ్వర్ ,సతీష్ తదితరులు పాల్గొన్నారు.ఆశ్రమ నిర్వాహకులు శ్రీ విక్టర్ పాల్ ఫిలిప్,శ్రీమతి దేవమణి,సిస్టర్ జాయ్ మరియు విచ్చేసిన ప్రముఖులు "మల్లె తావిలా గుప్పుమనిన మానవత్వం" అని అభివర్ణించి,అభినందించారు.

0/Post a Comment/Comments