"వృక్ష సంపద పెరగాలి!!"-గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడు

"వృక్ష సంపద పెరగాలి!!"-గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడు

"వృక్ష సంపద పెరగాలి!!"
----------------------------------
మనిషి ఆయువు పెరగాలంటే!!
ప్రాణవాయువు కావాలంటే !!
పచ్చని చెట్లు పెంచాలి
ప్రగతి బాటలు వేయాలి

కరువులు పరుగున పోవాలంటే!
బ్రతుకులు చల్లగ ఉండాలంటే!!
తరువులు మెండుగ పెంచాలి
జగతిని పండుగ చేయాలి

ఓజోన్ పొరను కాయాలంటే!
కాలుష్యం భువిని తరగాలంటే!!
వృక్ష సంపద పెరగాలి
ప్రకృతి అందం పంచాలి

సస్యశ్యామలం కావాలంటే !
వానలు దండిగ కురియాలంటే!
చెట్లను నరుకుట ఆపాలి
మొక్కలు విరివిగా నాటాలి
--గద్వాల సోమన్న 

0/Post a Comment/Comments