బడి అంటే!!---
-------------------------------
చదువులమ్మ ఒడిరా!
గురుదేవుల గుడిరా!
విజ్ఞానం పంచే
వినోదాల మడిరా!
అక్షరాల తోటరా!
జీవజలపు ఊటరా!
చిరు రాకుమారులుండే
అద్భుతాల కోటరా!
ఆటలకు నెలవురా!
పాటలకు పట్టురా!
అజ్ఞానం తరిమేసే
విజ్ఞానం జ్యోతిరా!
భవితకు పునాదిరా!
బ్రతుకగును ఉగాదిరా!
తెలుసుసో!! బడి అంటే !!
పిల్లలుండే చోటురా!
--గద్వాల సోమన్న
-------------------------------
చదువులమ్మ ఒడిరా!
గురుదేవుల గుడిరా!
విజ్ఞానం పంచే
వినోదాల మడిరా!
అక్షరాల తోటరా!
జీవజలపు ఊటరా!
చిరు రాకుమారులుండే
అద్భుతాల కోటరా!
ఆటలకు నెలవురా!
పాటలకు పట్టురా!
అజ్ఞానం తరిమేసే
విజ్ఞానం జ్యోతిరా!
భవితకు పునాదిరా!
బ్రతుకగును ఉగాదిరా!
తెలుసుసో!! బడి అంటే !!
పిల్లలుండే చోటురా!
--గద్వాల సోమన్న