సంక్రాంతి సంబరాలు - ఆనంద తొరణాలు - దొడ్డపనేని శ్రీ విద్య

సంక్రాంతి సంబరాలు - ఆనంద తొరణాలు - దొడ్డపనేని శ్రీ విద్య

*సంక్రాంతి సంబరాలు*
*ఆనంద తోరణాలు*

🔆🎋🔆🎋🔆🎋🔆
ఊరూరా తిరిగే హరిదాసుల కోలాహలం
నింగి కెగసే పతంగుల కెరటం

ఇంటింటా చిన్నా పెద్దల 
పండుగ వాతావరణం
ఘమ ఘమలాడే పిండి వంటలతో
అమ్మలక్కల ఆనందోత్సాహం

కొత్త అల్లుళ్ళ ఆలకల ఆరాటం
బావ మరదళ్ళ చిలిపి సరసం

ఊరు వాడా భోగి మంటల పరమార్థం
చిందులేసే డుడు బసవన్నల
 దీవెనలమయం
పాడి పంటలతో రైతున్నల ఆనందం
పితృ దేవతలను  సంత్రుప్తి
 పరిచే బట్టల సాంప్రదాయం

తెలుగు లోగిళ్ళలో
రంగవల్లుల సంబరం
గొబ్బెమ్మలతో అలంకరించి 
పడతుల నర్తనం

భోగి రాశులుగా మారే 
రేగు పళ్ళు
పిల్లల పాపల తలపై 
తలంబ్రాలుగా జారటం

మూడు రోజుల మత్యాల సంబరాలు
మన తెలుగు వెలుగు
పండుగలు మదిలో మెదిలే
*ఎన్నో జ్ఞాపకాల ఆనంద తొరణాలు*
*ఈ సంక్రాంతి సంబరాలు*
🎋🔆🎋🔆🎋🔆🎋

*దొడ్డపనేని శ్రీ విద్య*
విజయవాడ
30/12/2021

0/Post a Comment/Comments