జరుగుమల్లి.వీరయ్య

జరుగుమల్లి.వీరయ్య

ప్రవాహిణి వెబ్ పత్రిక ప్రచురణ కొరకు
అంశం : అటల్ బిహారీ వాజ్ పేయి జన్మదినోత్సవం సందర్భంగా..
కవితాశీర్షిక :  జనహృదయనేత
రచయిత: జరుగుమల్లి వీరయ్య
              కలికరి చిత్తూర్ జిల్లా,
చరవాణి : 81069747626
               జనహృదయనేత
మంచి చేయడానికి అనుకూలమైన వాతావరణాన్ని
చెడు చేయడానికి ఏమాత్రం కుదరదని
నిరూపించి,
సుపరిపాలనకు బాటలు వేసి
సంకుచిత రాజకీయ ప్రయోజనాల కన్నా
జాతీయ హితానికి పెద్దపీట వేసిన రాజనీతిజ్ఞుడు, జనహృదయనేత - అటల్ బిహారీ వాజ్ పేయి.
ఓటమిని అంగీకరించను,
పోరాటం ప్రారంభిస్తాను,
కొత్త పాట పాడుతాను, అన్న
కవితా పంక్తులు,
మడమ తిప్పని ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనాలు.
ఏడు పదుల రాజకీయ జీవితంలో
ప్రతిపక్ష నాయకుడిగా,
దేశాధినేతగా, ప్రతి దశలో
దేశాభివృద్ధిని కాంక్షించిన భారత రత్నం... మన వాజ్ పేయి.
రాజకీయ భీష్మ కురువృద్ధుడు,
అసలైన ప్రజాస్వామ్యవాది,
భావితరాలకు మార్గదర్శి,
వాజ్ పేయి జీవితం మొత్తం ప్రజాసేవకే అంకితం.
భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా
కేంద్ర మంత్రిగా, భారతావనికి ప్రధానమంత్రిగా చేపట్టిన పదవులకు
వన్నె తెచ్చిన ఆదర్శప్రాయుడు,
ఆదర్శవంతమైన రాజకీయ వేత్త.
వాజ్ పేయి జీవిత ప్రస్థానం భావితరాలకు కరదీపిక,
బహుముఖ ప్రజ్ఞాశాలి,
నైతిక రాజకీయ విలువలకు కట్టుబడిన జనహృదయనేత...! మన అటల్ బిహారీ వాజ్ పేయి...!!
నేడు అటల్ బిహారీ వాజ్  పేయి జన్మదినోత్సవం సందర్భంగా.. మా హార్దిక శుభాకాంక్షలు.

హామీ పత్రము : ఇది నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను.


 

0/Post a Comment/Comments